Terrorist Suicide Attack On An Army Company Operating Base: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆర్మీ క్యాంపు లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాలని అనుకున్నారు. అయితే వీరి ప్రయత్నాన్ని భద్రతా బలగాలు అడ్డగించాయి. గతంలో ఉరీ తరహా దాడికి ప్రయత్నించేందుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. రాజౌరీలోని దర్హాల్ ప్రాంతంలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపు కంచెను దాటేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఘటన జరిగిన ప్రదేశం దర్హాల్ పోలీస్ స్టేషన్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజౌరీ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ కంపెనీ స్థావరంపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు.
75వ స్వాతంత్య్ర వేడుకలకు కొన్ని రోజుల ముందు భారీ దాడి చేసేందుకు ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది ఆర్మీ. పర్గల్ ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించిన ఆత్మాహుతి బాంబర్లు తమను తాము పేల్చేసుకుని చనిపోయారు. ఉగ్రవాదులు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఆర్మీ క్యాంపుకు మరిన్ని బలగాలను పంపారు. సరిహద్దుల్లోని ప్రాంతాలను ఆర్మీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది.
Read Also: India-China: చైనా వక్రబుద్ధి.. భారత్ ప్రతిపాదనపై జాప్యం
2016లో ఇలాగే జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులు సైనికులుగా దుస్తులు వేసుకుని ఉరీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో క్యాంపు కంచెను కత్తిరించి ఉగ్రవాదులు క్యాంపులోకి ప్రవేశించారు. ఈ ఘటనలో 19 మంది వీర జవాన్లు మరణించారు. ఈ ఘటన అనంతరం ఇండియా పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్టైక్స్ జరిపాయి.
ఇదిలా ఉంటే నిన్న కాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం తెల్లవారుజామున ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో చుట్టుముట్టిన భద్రతా బలగాలు వారిని హతమార్చాయి. ఈ ఎన్ కౌంటర్ లో కీలక ఉగ్రవాది.. గతంలో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్, అమ్రీన్ భట్ ను చంపిన ఉగ్రవాది లతీఫ్ రాథర్ అకా అబ్దుల్లా కూడా ఉన్నాడు.
J&K | Two terrorists, who carried out a suicide attack on an Army company operating base 25 kms from Rajouri, killed; three soldiers lost their lives. Operations in progress.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/QspNSFhfX6
— ANI (@ANI) August 11, 2022