Legends League Cricket: మాజీ స్టార్ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకండ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 15న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్నట్లు లెజెండ్ లీగ్ క్రికెట్ శుక్రవారం వెల్లడించింది. భారత్ స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక మ్యాచ్ జరుగబోతోంది. ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ప్రత్యేక మ్యాచ్ ఉండనుంది. ఈ మ్యాచులో మొత్తం 10 దేశాలకు చెందిన క్రికెట్ ప్లేయర్లు పాల్గొంటారు.
MLA son-in-law rash driving.. Six people died: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కియా సెల్టోస్ కారు ఆటోను, బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటన ఆనంద్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా.. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
Source of River Thames dries out for first time: యూకే కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల భారీగా నమోదైన ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, సరైన వర్షాలు కురవకపోవడంతో ప్రఖ్యాత థేమ్స్ నది ఎండిపోతోంది. చాలా ప్రాంతాల్లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి చేరడంతో పాటు కొన్ని చోట్ల నీటి ఆనవాళ్లు కూడా లేకుండా ఎండిపోయింది. 1935 తర్వాత ఎన్నడూ లేని విధంగా గత నెలలో ఇంగ్లాండ్ వ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండల ధాటికి యూకే ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది.
BJP MP Chhedi Paswan comments on CM nistish kumar: బీజేపీతో పొత్తు తెంచుకుని ఆర్జేడీతో జట్టు కట్టిన సీఎం నితీష్ కుమార్ పై బీజేపీ విమర్శల పదును పెంచింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ నితీష్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఆర్జేడీతో నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమయంలోనే బీహార్ వ్యాప్తంగా క్రైం రేటు పెరిగిపోయిందంటూ.. నేరాల జాబితాను కూడా విడుదల చేశారు. ఇక అస్సాం సీఎం హిామంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. మేం కూడా పార్టీలు…
National award winning playback singer Shivamoga Subbanna passed away: ప్రముఖ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత శివమొగ్గ సుబ్బన్న(83) కన్నుమూశారు. బెంగళూర్ లోని జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్‌లో చికిత్స పొందుతున్న సుబ్బన్నకు గత రాత్రి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో మరణించారు. సుబ్బన్న కర్ణాటక రాష్ట్రం నుంచి మొదటిసారిగా జాతీయ అవార్డు అందుకున్న సింగర్
Communal clashes in Karnataka: కర్ణాటకలో మతాంతర ప్రేమ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఈ ఘటన కర్ణాటక కొప్పల్ జిల్లా హులిహైదర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హులి హైదర్ గ్రామానికి చెందిన హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుని పారిపోయారు. దీంతో వీరిద్దరిని పోలీసులు పట్టుకువచ్చి ఇరు కుటుంబాలకు అప్పగించాయి.
BJP criticizes CM Nitish Kumar and RJD alliance: లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో, సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూ పొత్తు పెట్టుకుని మరోసారి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం ఎనిమిదో సారి సీఎంగా నితీష్ కుమార్ పదవీ స్వీకారం చేశారు. లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టారు. ఇన్నాళ్లు జేడీయూతో పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీగా మారింది. అయితే బీజేపీతో పొత్తును తెంచుకున్న కొన్ని గంటల్లోనే బీహార్ రాష్ట్రంలో నేరాలు…
Ohio Police officers killed an armed man who tried to breach the FBI office: అమెరికాలోని ఓహియో సిన్సినాటి ఫీల్డ్ లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీ ఐ) కార్యాలయంపై దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసుల కాల్చిచంపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఎఫ్ బీ ఐ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు సాయుధ దుండగుడు ప్రయత్నించారు.
CM Nitish Kumar Comments On Sushil Kumar Modi's vice president claimsబీజేపీ విమర్శలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. నిన్న బీజేపీ ఎంపీ, మాజీ బీహార్ డిఫ్యూటీ స్పీకర్ సుశీల్ కుమార్ మోదీ, సీఎం నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ ఉప రాష్ట్రపతి కావాలనుకున్నారని.. సుశీల్ మోదీ వ్యాఖ్యలు చేశారు. అందుకు బీజేపీని పొత్తును వదిలేసుకున్నారని వ్యాఖ్యానించారు. కొంతమంది జేడీయూ నేతలు మా దగ్గరకు వచ్చి నితీష్ కుమార్ ను ఉప రాష్ట్రపతి చేయాలని
Jagdeep Dhankhar Takes Oath As Vice President: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కర్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కొత్తగా ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జగ్దీప్ ధన్కర్ కు నేతలు…