Venu Goapl Reddy
Author- NTV Telugu-
Karnataka: అల్లాపై బీజేపీ నేత వ్యాఖ్యలు.. కలెక్టరేట్ ముందు ముస్లింల ప్రార్థనలు..
Karnataka: బీజేపీ నేత, మాజీ మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై ముస్లింలు మండిపడుతున్నారు. ఆయన ఇటీవల నమాజ్, అల్లాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ముస్లింలు నిరసన తెలుపుతున్నారు. కర్ణాటక శివమొగ్గ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ముస్లిం సంఘాల సభ్యులు భారీగా చేరుకుని ఆజాన్ పఠించారు. భారీగా హాజరైన ముస్లింలు ప్రార్థనలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ముందు కూడా ఇదే విధంగా చేస్తామని హెచ్చరించారు. -
Elon Musk: ట్రంప్ మళ్లీ భారీ విజయం సాధిస్తారు.. అరెస్ట్‌పై మస్క్ కీలక వ్యాఖ్యలు..
Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ను అరెస్ట్ చేసి, ఆయనపై నేరాలు మోపితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించడం ఖాయం అని ప్రపంచ టాప్-1 బిలియనీర్ ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. వచ్చే వారం ట్రంప్ పై అభియోగాలు మోపుతారనే వార్తలపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఇదే జరిగితే ఆయన అద్భుత విజయం ఖాయమని అన్నారు. -
Khalistan: ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న “ఖలిస్తాన్”
"Khalistan" trending on Twitter: ఖలిస్తాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పంజాబ్ తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే అమృత్ పాల్ సింగ్ అనుచరులు, బాడీగార్డులను కలుపుకుని 78 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ అంతటా ఎలాంటి విద్వేష సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపేశారు. -
India Power Consumption: దేశంలో పెరిగిన విద్యుత్ వినియోగం..
India Power Consumption: భారత దేశంలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరిలో భారతదేశ విద్యుత్ వినియగోం 10 శాతం పెరిగి 1375.57 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2021-22లో సరఫరా అయిన విద్యుత్ ను ఇప్పటికే అధిగమించాం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1245.54 బిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. తాజాగా ఈ ఏడాది దాన్ని మించిన విద్యుత్ వినియోగం జరిగింది. -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ మాజీ ప్రధానిపై ఉగ్రవాద కేసు
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కు ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై తాజాగా పోలీసులు తీవ్రవాద కేసు నమోదు చేశారు. అవినీతి కేసులో కోర్టు విచారణకు ముందు ఇస్లామాబాద్‌లోని జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల విధ్వంసానికి పాల్పడడం, భద్రతా సిబ్బందిపై దాడి చేయడం, శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు ఇమ్రాన్ ఖాన్ తో పాటు మరికొంత మందిపై పాకిస్తాన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి ఢిల్లీ పోలీసులు.. టైం కావాలన్న కాంగ్రెస్ నేత
Rahul Gandhi: మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ వ్యాఖ్యలపై ఆయన నుంచి వివరాలు కోరుతున్నారు పోలీసులు. ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలోని పోలీస్ టీం తుగ్లక్ లేన్ లో ఉన్న రాహుల్ ఇంటికి వెళ్లింది. -
Akhilesh Yadav: కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది.. అఖిలేష్ వార్నింగ్..
Akhilesh Yadav: ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇదే విధంగా చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పని అయిపోయిందని, రానున్న కాలంలో బీజేపీకి కూడా ఇదే గతి పడుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. -
Ukraine War: ఆక్రమిత ఉక్రెయిన్‌లో పుతిన్ ఆకస్మిక పర్యటన.. మారియోపోల్ సందర్శన
Putin Visits Mariupol: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆక్రమిత ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. మారియోపోల్ నగరాన్ని సందర్శించారు. యుద్దం ప్రారంభం అయిన తర్వాత ఈ నగరాన్ని రష్య ఆక్రమించింది. తాజాగా మొదటిసారిగా పుతిన్ ఈ నగరాన్ని సందర్శించారు. వేలాది మంది ఉక్రెయిన్ పిల్లలపై రష్యా అకృత్యాలకు పాల్పడిందని ఇంటర్నెషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఈ పర్యటన జరిగింది. -
Punjab: అస్సాంకు అమృత్‌పాల్ సింగ్ అనుచరులను..భయానక వాతావరణం సృష్టించొద్దన్న సిక్కు సంస్థ
Punjab: ఖలిస్తానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు ముమ్మరంగా వెతుకుతున్నారు. పంజాబ్ పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలు పంజాబ్ ను జల్లెడ పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంజాబ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేశారు. ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 78 మందిని అరెస్ట్ చేశారు. -
Amritpal Singh: పంజాబ్ లో హై అలర్ట్.. అమృత్‌పాల్ సింగ్ కోసం ముమ్మర గాలింపు.. అనుచరుల అరెస్ట్
Amritpal Singh: పంజాబ్ లో హై అలర్ట్ నెలకొంది. పంజాబ్ వ్యాప్తంగా పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నేత అమృత్ పాల్ సింగ్ కోసం విస్తృతంగా వెతుకుతున్నారు. అతడిని పట్టుకునేందుకు నిన్న పంజాబ్ ప్రభుత్వం ఆపరేషన్ ప్రారంభించింది. నిన్న దొరికినట్లే దొరికి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పటు చేశారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెర్ సర్వీసులను షట్ డౌన్ చేశారు. అమృత్ పాల్ సింగ్ కోసం అనుమానం…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!