Jagdeep Dhankhar will take oath as the Vice President: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కొత్తగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌కర్ చేత గురువారం ఉదయం 11.45 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరుపున పోటీ చేసి ధన్ కర్, యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాను ఓడించారు.
కాంగ్రెస్ పార్టీ, విపక్షాల అభ్యర్థిగా నిలిచిన మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు రాగా.. జగదీప్ ధన్‌కర్ కు 528 ఓట్లు వచ్చాయి. ధన్ కర్ 74.36 శాతం ఓట్లు సాధించారు. ఎన్డీయే పక్షాలతో పాటు వైసీపీ, బిజూ జనతా దళ్, శివసేన, ఏఐఏడీంకే పార్టీలు కూడా జగదీప్ ధన్‌కర్ కు మద్దతు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా వ్యహరించనున్నారు. ఆగస్టు 10తో వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగిసింది.
Read Also: Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ లో ఆత్మాహుతి దాడి.. ఉరీ తరహా దాడికి యత్నం
గతంలో బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్‌కర్, భారత దేశంలో రెండో అత్యున్నత పదవిని అధిరోహించారు. రాజస్థాన్ లోని సామన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జగదీప్ ధన్‌కర్ అంచెలంచెలుగా పైకి వచ్చారు. న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ఎదిగారు. మొదట్లో కాంగ్రెస్ ఉన్న ధన్ కర్ ఆ తరువాత బీజేపీలో చేరారు. 2019 నుంచి బెంగాల్ గవర్నర్ గా విధులు నిర్వహించారు. ఈయన గవర్నర్ గా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ధన్ కర్ కు మధ్య కోల్డ్ వార్ నడిచింది.