Corona Cases In India: దేశంలో గత రోజుతో పోలిస్తే స్వల్పంగా రోజూవారీ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 16,299 మందికి కరోనా సోకింది. అంతకు ముందురోజు 16,047 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.85 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 19,431 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 53 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు సంఖ్య 1,25,076గా ఉంది.
దేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,06,996గా ఉంటే.. వీరిలో 4,35,55,041 మంది కోలుకోగా..5,26,879 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.53 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.28కి పడిపోయింది. డెత్ రేట్ 1.19 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 207.03 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. నిన్న ఒక్క రోజే 25,75,389 మంది టీకాలు వేయించుకున్నారు. గడిచిన 24 గంటల్లో 3,56,153 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు.
Read Also: Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతిగా నేడు జగదీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, జపాన్, సౌత్ కొరియా దేశాల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. జపాన్ లో కొత్తగా 1,96,732 కరోనా కేసులు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో 250 మంది మరణించారు. దక్షిణ కొరియాలో 1,51,734 కేసులు నమోదు కాగా.. 50 మంది మరణించారు. ఇక అమెరికాలో 95,530 కేసులు కొత్తగా బయటపడగా.. 429 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 59,20,66,829కు చేరింది. ఇందులో ఇప్పటి వరకు 64,45,795 మరణించారు.