CM Nitish Kumar Comments On Sushil Kumar Modi’s vice president claims: బీజేపీ విమర్శలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. నిన్న బీజేపీ ఎంపీ, మాజీ బీహార్ డిఫ్యూటీ స్పీకర్ సుశీల్ కుమార్ మోదీ, సీఎం నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ ఉప రాష్ట్రపతి కావాలనుకున్నారని.. సుశీల్ మోదీ వ్యాఖ్యలు చేశారు. అందుకు బీజేపీని పొత్తును వదిలేసుకున్నారని వ్యాఖ్యానించారు. కొంతమంది జేడీయూ నేతలు మా దగ్గరకు వచ్చి నితీష్ కుమార్ ను ఉప రాష్ట్రపతి చేయాలని.. ఇలా చేస్తే బీజేపీ వ్యక్తి బీహార్ సీఎం కావచ్చని చెప్పారని.. అయితే తమకు సొంత అభ్యర్థి ఉండటం వల్ల దీనికి మేం ఒప్పు కోలేదని సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. ఇందు కోసమే బీజేపీతో జేడీయూ పార్టీ, నితీష్ కుమార్ తెగదెంపులు చేసుకున్నారని విమర్శించారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం నితీష్ కుమార్ స్పందించారు. వాట్ ఏ జోక్.. ఇది బోగస్ అని.. నాకు ఉప రాష్ట్రపతి కావాలనే కోరి లేదని.. మేం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన విషయాన్ని వారు మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి పదవులు వస్తాయని.. మాట్లాడనివ్వండి అంటూ నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ విమర్శలను జేడీయూ జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ ఖండించారు. జేడీయూలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం గురించి ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. బీహార్ రాష్ట్రంలో కూడా మహారాష్ట్ర పరిస్థితులు తెచ్చి జేడీయూను చీల్చేందుకు ప్రయత్నించారని జేడీయూ ఆరోపిస్తోంది. అందుకనే బీజేపీతో బంధాన్ని తెంచుకున్నామని చెబుతోంది.
Read Also: Jagdeep Dhankhar: 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన జగ్‌దీప్ ధన్‌కర్
బీజేపీతో బంధాన్ని తెంచుకున్న జేడీయూ.. బుధవారం కాంగ్రెస్, లాలూ ప్రసాద్ ఆర్జేడీ పార్టీతో కలిసి కొత్త కూటమిని అధికారాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ రాష్ట్రముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మారింది. అయితే పీఎఫ్ఐ విచారణ చేస్తున్న నేపథ్యంలోనే బీజేపీతో విడిపోయారనే వ్యాఖ్యలను తప్పుపట్టారు నితీష్ కుమార్.