COVID 19 CASES IN INDIA: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంటోంది. ఇటీవల కాలంలో 16 వేలకు అటూ ఇటూగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 15,815 మంది కరోనా వ్యాధి బారినపడ్డారు. అయితే కరోనా మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 68 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. అయితే రికవరీ అయ్యేవారి సంఖ్య పెరిగింది. గడిచిన ఒక రోజులో 20,018 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Independence Day 2022: బ్రిటీష్ వలస పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు అవుతోంది. దీంతో ఈ ఏడాది ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో భారతదేశం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండగగా జరుపుకుంటోంది. ప్రతీ ఇంటిపై భారత మువ్వన్నెల పతాకం ఎగవేస్తున్నారు ప్రజలు. ఇదిలా ఉంటే భారత్ తో పాటు అదే రోజు మరో 4 దేశాలు కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయని తెలుసా..? భారత్ లాగే ఆ దేశాలు కూడా వలసవాదం, పరాయి పాలన…
Women's IPL likely to happen in next year: భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ ఓ సంచలనం. కొత్త టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడంతో పాటు మరింత ఆర్థికంగా బీసీసీఐ బలోపేతం అయ్యేందుకు ఐపీఎల్ సహకరించింది. ఇక విదేశీ క్రికెటర్లకు కూడా కాసులు వర్షం కురిపిస్తోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్ ఇప్పటి వరకు 15 ఎడిషన్లను పూర్తి చేసుకుంది.
RSS Changes Profile Pictures Of Social Media Accounts To National Flag: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శుక్రవారం తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ ను మార్చడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆర్ఎస్ఎస్ కాషాయ జెండానే తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా ఉంటుంది. అయితే తాజాగా కాషాయ జెండాను మార్చి జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టింది. భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం ‘ఆజాదీ కా…
Donald Trump: మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చిక్కులు తప్పేలా లేవు. అధ్యక్షుడిగా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కొన్ని రహస్య పత్రాలను తనతో తీసుకెళ్లినట్లుగా..గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించడం, న్యాయాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వం రికార్డులను నేరపూరితంగా నిర్వహించడం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. యూఎస్ లా డిపార్ట్మెంట్ ట్రంప్ పై విచారణ చేస్తోంది. ఇప్పటికే ఎఫ్ బీ ఐ ఏజెంట్లు ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో ఇంటిలో పెద్ద ఎత్తున సోదాలు చేసింది. అయితే ఆ సయమంలో ఆ ఇంటి నుంచి కొన్ని…
Salman Rushdie On Ventilator: ప్రముఖ రచయిత, బుకర్ ఫ్రైజ్ అవార్డ్ గ్రహీత, భారత సంతతి బ్రిటన్ పౌరుడు సల్మాన్ రష్డీపై శుక్రవారం దుండగుడు దాడి చేశారు. ఓ సభలో ప్రసంగిస్తున్న సమయంలో దుండగుడు కత్తి పోట్లకు గురయ్యారు. రష్దీ ఓ పుస్తక ఆవిష్కరణ సభలో ఉండగా ఈ దాడి జరిగింది. పదికి పైగా కత్తిపోట్లకు గురైనట్లు తెలుస్తోంది. మెడపై తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.
Montenegro mass shooting: బాల్టిక్ దేశం మాంటెనెగ్రోలో దారుణం జరిగింది. సిటింజే సిటీలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. ఏకంగా 11 మందిని హతమర్చాడు. వేటాడే తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా మరణించాడు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. మాంటెనెగ్రో పోలీస్ డైరెక్టర్ జోరన్ బ్రిడ్జానిన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం 34 ఏళ్ల వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు.
Samsung Boss Gets Presidential Pardon: సామ్సంగ్ గ్రూప్ వారసుడు లీజే యాంగ్ కు విముక్తి లభించింది. ఆర్థిక అవినీతి, లంచం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ క్షమాభిక్ష పెట్టారు. ఆగస్టు 15 దక్షిణ కొరియా లిబరేషన్ డేను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శిక్ష అనుభవిస్తున్న 17 వందల మంది దోషులకు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది.
Rakhis for Gurmeet Ram Rahim:హర్యానా డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రాహీమ్ సింగ్ కు ఇబ్బడిముబ్బడిగా రాఖీలు, గ్రీటింగ్ కార్డులు వచ్చిపడుతున్నాయి. దీంతో పోస్టల్ శాఖ వాటిని వేరు చేసేందుకు పగలు రాత్రి కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ ఏడాది రక్షా బంధన్ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డేరా బాబా భక్తులు రామ్ రహీమ్ సింగ్ కు వేలల్లో రాఖీలు పంపుతుంటారు. ప్రస్తుతం రోహ్ తక్ లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్…
Taliban cleric Killed In ISIS Suicide Blast : తాలిబన్ మత గురువు, ఆప్ఘాన్ లో కీలక నేతగా ఉన్న రహీముల్లా హక్కానీని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడిలో మరణించారు. ఐఎస్ఐఎస్ ను తీవ్రంగా వ్యతిరేకించే ఆయన్ను ఐసిస్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. గురువారం రహీముల్లా హక్కానీ.. కాబూల్ లోని అతని మదర్సాలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో హక్కానీతో పాటు అతని సోదరుడు మరణించారని తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గతం రెండు…