Shivamogga Subbanna: జాతీయ అవార్డు గ్రహీత.. ప్రముఖ సింగర్ శివమొగ్గ సుబ్బన్న కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National award winning playback singer Shivamoga Subbanna passed away: ప్రముఖ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత శివమొగ్గ సుబ్బన్న(83) కన్నుమూశారు. బెంగళూర్ లోని జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్‌లో చికిత్స పొందుతున్న సుబ్బన్నకు గత రాత్రి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో మరణించారు. సుబ్బన్న కర్ణాటక రాష్ట్రం నుంచి మొదటిసారిగా జాతీయ అవార్డు అందుకున్న సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కాదు కుదురే’ చిత్రంలో ఆయన పాడిన ‘కాదు కుదురే ఒడి బండిట్ట’ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన అభిమానుల సందర్శనార్థం బెంగళూర్ లోని రవీంద్ర కళాక్షేత్రంలో పార్థీవదేహాన్ని ఉంచనున్నారు.
Read Also: RBI Update: ఆర్బీఐలోకి ఆ నలుగురు మళ్లీ
Also Read
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
సుబ్బన్న అసలు పేరు జి. సుబ్రమణ్యం. గణేష్ రావు, రంగనాయకమ్మలకు 1938లో శివమొగ్గ జిల్లాలోని నగర్ గ్రామంలో జన్మించారు. సుబ్బన్న తాగా శ్యామన్న సంగీతంలో పండితుడు. దీంతో సుబ్బన్న కూడా సంగీతంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. శాస్త్రీయ సంగీతంలో పట్టు సంపాదించారు. బీఏ ఎల్ఎల్బీ చేసిన సుబ్బన్న కొంత కాలం న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఆ తరువాత గాయకుడిగా మారారు. కన్నడ చిత్రసీమలో సుబ్బన్న తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ దర్శకుడు చంద్ర శేఖర కంబార్ ‘కరిమాయి’ సినిమా ద్వారా నేపథ్య గాయకుడిగా పరిచయం అయ్యారు. 1979లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి చేతుల మీదుగా రజత కమలం అవార్డును అందుకున్నారు సుబ్బన్న. సుబ్బన్నకు అనేక అవార్డులను ప్రధానం చేసింది కర్ణాటక సర్కార్. ప్రతిష్టాత్మక సంత్ శిశునాల షరీఫ్ అవార్డుతో పాటు రాజ్యోత్సవ అవార్డ్, సంగీత అకాడమి కర్ణాటక కళా తిలక్ అవార్డ్ తో సత్కరించింది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!