USA: ఎఫ్ బీ ఐ ఆఫీస్ పై దాడికి యత్నం.. దుండగుడిని కాల్చిచంపిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ohio Police officers killed an armed man who tried to breach the FBI office: అమెరికాలోని ఓహియో సిన్సినాటి ఫీల్డ్ లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీ ఐ) కార్యాలయంపై దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసుల కాల్చిచంపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఎఫ్ బీ ఐ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు సాయుధ దుండగుడు ప్రయత్నించారు. సుదీర్ఘ ప్రతిష్టంభన తరువాత దుండగుడిని ఓహియో పోలీసులు కాల్చి చంపారు. హై సెక్యురిటీ ప్రాంతంగా ఉన్న ఎఫ్ బీ ఐ కార్యాలయంలో చొరబడేందుకు నిందితుడు ఎందుకు ప్రయత్నించాడనే దానిపై విచారణ జరుగుతోంది. ఘటన వెనక ఉద్దేశ్యాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.
నిందితుడు పక్కాగా ఎఫ్ బీ ఐ కార్యాలయంపై దాడి చేసేందుకు వచ్చాడని తెలుస్తోంది. కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని.. ఆ తరువాత పారిపోయాడని.. అయితే పోలీసులు అతడిని ఛేజ్ చేసి పట్టుకునేందుకు, మాట్లాడేందుకు ప్రయత్నించారని, కానీ పోలీసులపైకి గన్ ఎక్కుపెట్టడంతో కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
Read Also: Jammu Kashmir: ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు ఉగ్రవాదులు హతం, ముగ్గురు జవాన్లు వీరమరణం
అధ్యక్ష ఎన్నికల సమయంలో 2021 జనవరిలో 6న యూఎస్ క్యాపిటల్ పై జరిగిన దాడిలో పాల్గొన్న వ్యక్తులతో, ఇతర ఉగ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా ఇంటిపై ఎఫ్ బీ ఐ అధికారుల దాడుల తరువాత ఓహియో ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎఫ్ బీ ఐ డైరెక్టర్ ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఇంటిలో సోదాలు చేసిన తర్వాత ఎఫ్ బీ ఐ ఏజెంట్లకు బెదిరింపులు పెరిగాయి.. రిపబ్లికన్లు ఎఫ్ బీ ఐకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!