Venu Goapl Reddy
Author- NTV Telugu-
Earthquake: మార్చి నెలలో 6 భూకంపాలు.. ఉత్తరాదిని వణికిస్తున్న ప్రకంపనలు..
Earthquake: వరస భూకంపాలతో ఉత్తర భారతదేశం వణుకుతోంది. ఒక్క మార్చి నెలలోనే రిక్టర్ స్కేల్ పై 4 తీవ్రతతో 6 భూకంపాలు వచ్చాయి. ఫిబ్రవరి నుంచి లేక్కేస్తే 10 భూకంపాలు వచ్చాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపం ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను వణికించింది. తాజా భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్ లని హిందూకుష్ ప్రాంతంలో నమోదు అయింది. ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్థాన్, భారత్ లో దీని ప్రకంపనలు కనిపించాయి. -
Supreme Court: బిల్కిస్ బానో పిటిషన్‌పై ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకు సుప్రీం అంగీకారం
Supreme Court: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు శిక్షను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు బిల్సిస్ బానో న్యాయవాది శోభా గుప్తా వెల్లడించారు. -
Russia: ఐఫోన్లు పడేయండి లేదా మీ పిల్లలకు ఇవ్వండి.. అధికారులకు అధ్యక్ష భవనం ఆదేశాలు..
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు ఐఫోన్లు వాడొద్దనే ఆదేశాలు అధికారులకు వెళ్లాయి. అధ్యక్ష భవనం క్రెమ్లిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అమెరికా తయారీ ఐఫోన్ కావడంతో పాశ్చాత్య దేశాలు నిఘా పెంచే అవకాశం ఉండటంతో క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తవి కొనొద్దని, ఉన్నవాటిని పక్కన పారేయాలని అధికారులను ఆదేశించారు. -
PM Modi: ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు..
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ పలు రాష్ట్రాల ప్రజలకు కొత్త సంవత్సర శుభాక్షాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆనందం, శ్రేయస్సును ఆయన ఆకాంక్షించారు. వరసగా వివిధ రాష్ట్రాల సంప్రదాయ కొత్త సంవత్సరంపై ట్వీట్స్ చేశారు. -
Jharkhand: శ్రీరామ నవమి ఊరేగింపుపై నిషేధం.. తాలిబాన్ పాలనలో ఉన్నామా అంటూ బీజేపీ ఆందోళన
Ram Navami Procession: శ్రీరామ నవమి ఊరేగింపుపై ఆంక్షలు విధించడంపై జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హజారీబాగ్ లో రామనమవి ఉరేగింపుల్లో డీజే వాడొద్దని, సంప్రాదాయ కర్రల విన్యాసాలు చేయొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనిపై మంగళవారం జార్ఖండ్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. బీజేపీ సభ్యులు జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ చర్యను తప్పుపట్టారు. జార్ఖండ్ రాష్ట్రం తాలిబాన్ల పాలనలో ఉందా.? అంటూ బీజేపీ సభ్యులు ప్రశ్నించారు. -
COVID-19: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
COVID-19: దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు 1000కి లోపే ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యిని దాటి నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,026కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో చత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు మరణించారు. -
PM Modi: మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు.. 44 కేసులు నమోదు చేసిన పోలీసులు..
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీ వ్యాప్తంగా పోస్టర్లు అంటిస్తున్నారు కొందరు. అయితే ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో వేల సంఖ్యలో మోదీకి వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లు వెలిశాయి. ‘‘ మోదీ హటావో-దేశ్ బచావో’’ అంటూ పోస్టర్లపై రాతలు ఉన్నాయి. వీటిపై పోలీసులు 44 కేసులు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరికి ప్రింటింగ్ ప్రెస్ ఉంది. -
Afghanistan Earthquake: ఆఫ్ఘన్, పాక్‌లలో 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు..
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో మంగళవారం 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ తోపాటు పాకిస్తాన్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరభారతదేశంలో కూడా రెండు నిమిషాల పాటు ప్రకంపలు వచ్చాయి. ఆఫ్ఘన్, పాక్ లలో భూకంపం వల్ల 11 మంది చనిపోయారు. పాకిస్తాన్ లో 100 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ స్వాత్ లోయలో గాయాల వల్ల ప్రజలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. పాకిస్తాన్ లో 9 మంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా… -
Amritpal Singh Case: ఐదో రోజు అమృత్‌పాల్ సింగ్ కోసం వేట.. ఇండో-నేపాల్ బోర్డర్లో హై అలర్ట్..
Amritpal Singh Case: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం ఐదో రోజు వేట కొనసాగుతోంది. పంజాబ్ తో పాటు చుట్టుపక్కట రాష్టాల్లో కూడా ఆయన కోసం పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండో-నేపాల్ బోర్డర్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఈ మార్గం గుండా నేపాల్ కు పారిపోయే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో శివలింగం కార్బన్ డేటింగ్‌పై స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశం
Gyanvapi Case: వారణాసి జ్ఞానవాపి మసీదు కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. మసీదులోని వాజుఖానాలో దొరికిన ‘‘శివలింగం’’గా చెప్పబడుతున్న ఆకారానికి కార్బన్ డేటింగ్ పై ఏప్రిల్ 15 లోగా స్పష్టత ఇవ్వాలని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. కార్బన్ డేటింగ్ ప్రక్రియ వల్ల శివలింగం దెబ్బతింటుదా..? అనేదానిపై ఏఎస్ఐ తన ప్రతిస్పందన తెలియజేయడానికి చివరి అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. కార్బన్ డేటింగ్ వల్ల మసీదు, అందులోని శివలింగం ఏ కాలానికి చెందినవనే వివరాలను…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!