Asaduddin owaisi comments on bjp, pm modi about kashmiri pandit assassination: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్లను టార్గెట్ చేశారు. మంగళవారం రోజూ సునీల్ కుమార్ భట్ అనే పండిట్ ను కాల్చిచంపారు. ఈ ఘటనపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. కాశ్మీర్ లో ఈ పరిస్థితికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షానే కారణం అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాపై విరుచుకుపడ్డారు అసదుద్దీన్.
Kashmiri Pandit shot dead by terrorists in jammu kashmir: జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి కాశ్మీరీ పండిట్లను టార్గెట్ చేస్తూ.. దుశ్చర్యకు పాల్పడ్డారు. కాశ్మీరీ పండింట్ ను కాల్చిచంపారు. ఈ ఘటన షోఫియాన్ జిల్లా చోటీపురా ఏరియాలో జరిగింది.
Former Pakistan Prime Minister Imran Khan praises India's foreign policy: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ప్రశంసలు కురిపించారు. తను అధికారం నుంచి దిగిపోయన తర్వాత నుంచి భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని, భారత దేశ విదేశాంగ విధానాన్ని పొగుడుతున్నారు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం విదేశాల ఒత్తడితో పనిచేస్తుందని.. పాకిస్తాన్ కు స్వతంత్ర విదేశాంగ విధానం లేదని విమర్శిస్తున్నారు.
UK PM Race: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ఆయన స్థానం కోసం భారత సంతతి వ్యక్తి రిషి సునక్, లిజ్ ట్రస్ పోటీ పడుతున్నారు. గతంలో పీఎం రేసులో అన్ని దశల్లో మొదటి స్థానంలో నిలిచిన రిషి సునక్... ఆ తరువాత జరిగిన డిబెట్లలో లిజ్ ట్రస్ తర్వాత నిలుస్తున్నారు. దీంతో యూకే ప్రధాని అవకాశాలు లిజ్ ట్రస్ కే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. తాజాగా ఓపినియం రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల…
INS Satpura, Indian Warship's Historic US Visit: భారత యుద్దనౌక ఐఎన్ఎస్ సాత్పురా అమెరికా పర్యటనలో చరిత్ర సృష్టించింది. ఓ భారత యుద్ధ నౌక అమెరికా పశ్చిమ తీరాన్ని చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ రికార్డును ఐఎన్ఎస్ సాత్పురా సొంతం చేసుకుంది. ఇండియాకు స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఐఎన్ఎస్ సాత్పురా ఈ చారిత్రాత్మక పర్యటన చేస్తోంది. అమెరికా పశ్చిమ తీరం కాలిఫోర్నియా లోని శాన్ డియాగోకు చేరుకుంది.
Pakistan plan to launch terror attacks in India: భారత దేశంలో విధ్వంసం సృష్టించడానికి దయాది దేశం పాకిస్తాన్ కుట్ర చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం నాడు దాడులు చేయడానికి ప్రణాళికలు చేసిందని ఇన్ పుట్స్ ఉన్నాయి. దీనికి అంతా తానై పాక్ గూఢాచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) వ్యవహరిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో దేశంలో చాలా ఉగ్రదాడుల వెనక ఐఎస్ఐ హస్తం ఉంది.
Gun firing At Canberra Airport: ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆస్ట్రేలియాలో తుపాకీ కాల్పలు కలకలం రేపాయి. ఆదివారం దేశ రాజధాని కాన్బెర్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రయాణికుల చెక్ ఇన్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
Partition Horrors Remembrance Day: భారత దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. వజ్రోత్సవ స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా దేశం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అఖండ భారత్ గా ఉన్న భారతదేశాన్ని బ్రిటిష్ వారి కుటిల నీతితో మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్ గా విభజించారు. భారత్ కన్నా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 14, 1947లో పాకిస్తాన్ కొత్త రాజ్యంగా ఏర్పడింది. ఆ రోజు స్వాతంత్య్రాన్ని చూస్తామనుకున్న చాలా…
Corona Cases In India: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత వారం 20 వేలకు అటూఇటూగా నమోదైన కేసులు ప్రస్తుతం కాస్త తగ్గాయి. గడిచిన కొన్ని రోజుల్లో రోజూవారీ కేసుల సంఖ్య సగటున 16 వేలల్లో ఉంటోంది. ఇదిలా ఉంటే కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 15 వేల లోపే నమోదు అయింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 14,092 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ మహమ్మారి బారిన పడి ఒక…
Harry Potter author JK Rowling receives death threat: ప్రముఖ రచయిత్రి, హ్యారీ పోటర్ రచయిత జేకే రౌలింగ్ కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఇటీవల దాడికి గురైన ప్రముఖ రచయిత, బుకర్ ఫ్రైజ్ విన్నర్ సల్మాన్ రష్దీ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ ప్రస్తుతం చాలా అనారోగ్యంగా అనిపిస్తోంది.. అతను త్వరగా కోలుకోనివ్వండి’