Sri Lanka government granted permission for Chinese research vessel: శ్రీలంక బుద్ధి మారలేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న దేశానికి ఏ దేశం కూడా అప్పు ఇవ్వని స్థితిలో భారత్ ఆదుకుంది. అయినా శ్రీలంకకు విశ్వాసం లేదు. గతంలో లాగే భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. మళ్లీ చైనాతో అంటకాగుతోంది. శ్రీలంక ఆర్థిక దుర్భర పరిస్థితికి కారణమైనా చైనానే ముద్దంటోంది. చైనా సర్వే, పరిశోధన నౌక యువాన్ వాంగ్ 5కు శ్రీలంక తన హంబన్ టోటా పోర్టులో ఆశ్రయం ఇచ్చేందుకు శనివారం అనుమతి ఇచ్చింది.. భారత్, శ్రీలంక ఈ నౌకకు ఆశ్రయం ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
నిజానికి ఇది శాటిలైట్ సర్వే నౌక అయినా.. ఇది సమీప దేశాల్లోని కార్యకలాపాలపై నిఘా పెడుతుంది. భారత్ లోని ప్రధానమైన అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, క్షిపణి పరిశోధన, ప్రయోగ కేంద్రాలు, అణు విద్యుత్ పై నిఘా పెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి భారత్ భద్రతకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ నౌక రావడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. యువాన్ వాంగ్ 5 సైనిక స్థావరాలపై నిఘా ఉంచవచ్చని భారత్ ఆందోళన చెందుతోంది. ఇది పరిశోధన నౌకగా.. నిఘా నౌకగా పనిచేయనుంది.
Read Also: Salman Rushdie: దాడి చేసింది ఆ యువకుడే.. ఇరాన్‌లో హీరోగా కీర్తి
అయితే యువాన్ వాంగ్ 5 వాస్తవానికి ఆగస్టు 11నే శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టుకు చేరాల్సి ఉంది. అయితే శ్రీలంక యువాన్ వాంగ్ 5 రాకను వాయిదా వేయాలని చైనాను కోరింది. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేకు భారత్ తన ఆందోళన తెలియజేసినప్పటికీ.. భారత్ సంతృప్తికర వివరణ ఇవ్వలేదని శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది. యువాన్ వాంగ్ నౌక హంబన్ టోటాలో ఈ నెల 16 నుంచి 22 వరకు లంగర్ వేయనుంది. ప్రస్తుతం నౌక శ్రీలంకు ఆగ్నేయంగా 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీలంకకు ఇబ్బడిముబ్బడిగా అప్పులు ఇచ్చిన చైనా.. ఈ సాకుతో శ్రీలంక హంబన్ టోటా పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది. దీన్ని 1.12 బిలయన్ డాలర్లకు చైానాకు లీజుకు ఇచ్చింది శ్రీలంక.