PM Modi interacts with medal winners of Commonwealth 2022 Games: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ 2022లో పాల్గొన్న భారత క్రీడా బృందంతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కామన్వెల్త్ గేమ్స్ లో పథకాలు గెలిచిన క్రీడాకారులను అభినందించారు. వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభానికి ముందు మోదీ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ‘‘ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం ముందు.. మీరు తిరిగి వచ్చేటప్పుడు మనమంతా కలిసి విజయోత్సవ్ జరుపుకుంటామని నేను మీకు చెప్పానని.. మీరు విజయం సాధించి తిరిగి వస్తారనే విశ్వసించానని.. ఇప్పుడు మనమంతా కలిసి విజయోత్సవ్ జరుపుకుంటున్నాం’’ అని ప్రధాని మోదీ అన్నారు. కొన్ని వారాల్లోనే కామన్వెల్త్ క్రీడల్లో మన క్రీడాకారులు అపూర్వ విజయం సాధించడంతో పాటు దేశం తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ ను నిర్వహించిందని అన్నారు.
Read Also: Asia Cup 2022: భారత్, పాక్ జట్లకు కష్టాలు..!
మిగతా కుటుంబ సభ్యుల్లాగే నేను కూడా మీతో మాట్లాడుతున్నందుకు గర్వంగా ఉందని ప్రధాని. గతంలో పోలిస్తే ఈ సారి 4 కొత్త క్రీడల్లో విజయాలు సాధించామని.. లాన్ బాల్స్ నుంచి అథ్లెటిక్స్ వరకు అద్భుత ప్రదర్శన చేశారని.. యువతలో కొత్త క్రీడలపై ఆసక్తి పెరుగుతోందని.. కొత్త క్రీడల్లో మన ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రీడా శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ కూడా పాల్గొన్నారు.
ఇటీవల ముగిసిన కామన్వెత్త్ గేమ్స్ లో భారత్ 22 స్వర్ణాలు, 15 రజత, 23 కాంస్య పతకాలను గెలుచుకుంది. మొత్తం 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, హాకీతో పాటు పలు క్రీడల్లో పతకాలను సాధించింది.