UK PM Race: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ఆయన స్థానం కోసం భారత సంతతి వ్యక్తి రిషి సునక్, లిజ్ ట్రస్ పోటీ పడుతున్నారు. గతంలో పీఎం రేసులో అన్ని దశల్లో మొదటి స్థానంలో నిలిచిన రిషి సునక్... ఆ తరువాత జరిగిన డిబెట్లలో లిజ్ ట్రస్ తర్వాత నిలుస్తున్నారు. దీంతో యూకే ప్రధాని అవకాశాలు లిజ్ ట్రస్ కే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. తాజాగా ఓపినియం రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల…
INS Satpura, Indian Warship's Historic US Visit: భారత యుద్దనౌక ఐఎన్ఎస్ సాత్పురా అమెరికా పర్యటనలో చరిత్ర సృష్టించింది. ఓ భారత యుద్ధ నౌక అమెరికా పశ్చిమ తీరాన్ని చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ రికార్డును ఐఎన్ఎస్ సాత్పురా సొంతం చేసుకుంది. ఇండియాకు స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఐఎన్ఎస్ సాత్పురా ఈ చారిత్రాత్మక పర్యటన చేస్తోంది. అమెరికా పశ్చిమ తీరం కాలిఫోర్నియా లోని శాన్ డియాగోకు చేరుకుంది.
Pakistan plan to launch terror attacks in India: భారత దేశంలో విధ్వంసం సృష్టించడానికి దయాది దేశం పాకిస్తాన్ కుట్ర చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం నాడు దాడులు చేయడానికి ప్రణాళికలు చేసిందని ఇన్ పుట్స్ ఉన్నాయి. దీనికి అంతా తానై పాక్ గూఢాచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) వ్యవహరిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో దేశంలో చాలా ఉగ్రదాడుల వెనక ఐఎస్ఐ హస్తం ఉంది.
Gun firing At Canberra Airport: ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆస్ట్రేలియాలో తుపాకీ కాల్పలు కలకలం రేపాయి. ఆదివారం దేశ రాజధాని కాన్బెర్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రయాణికుల చెక్ ఇన్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
Partition Horrors Remembrance Day: భారత దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. వజ్రోత్సవ స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా దేశం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అఖండ భారత్ గా ఉన్న భారతదేశాన్ని బ్రిటిష్ వారి కుటిల నీతితో మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్ గా విభజించారు. భారత్ కన్నా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 14, 1947లో పాకిస్తాన్ కొత్త రాజ్యంగా ఏర్పడింది. ఆ రోజు స్వాతంత్య్రాన్ని చూస్తామనుకున్న చాలా…
Corona Cases In India: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత వారం 20 వేలకు అటూఇటూగా నమోదైన కేసులు ప్రస్తుతం కాస్త తగ్గాయి. గడిచిన కొన్ని రోజుల్లో రోజూవారీ కేసుల సంఖ్య సగటున 16 వేలల్లో ఉంటోంది. ఇదిలా ఉంటే కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 15 వేల లోపే నమోదు అయింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 14,092 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ మహమ్మారి బారిన పడి ఒక…
Harry Potter author JK Rowling receives death threat: ప్రముఖ రచయిత్రి, హ్యారీ పోటర్ రచయిత జేకే రౌలింగ్ కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఇటీవల దాడికి గురైన ప్రముఖ రచయిత, బుకర్ ఫ్రైజ్ విన్నర్ సల్మాన్ రష్దీ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ ప్రస్తుతం చాలా అనారోగ్యంగా అనిపిస్తోంది.. అతను త్వరగా కోలుకోనివ్వండి’
Rakesh Jhunjhunwala passes away: స్టాక్ మార్కెట్ దిగ్గజం, బిగ్ బుల్ రాకేష్ రాకేష్ ఝున్ ఝున్ వాలా(62) ఆదివారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాకేష్ ఝున్ ఝున్ వాలా. ఇండియాలో స్టాక్ మార్కెట్ దిగ్గజంగా ఎదిరిన ఝున్ ఝున్ వాలా ఇటీవల ఆకాశ ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. ఉదయం తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన్న ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు. ఉదయం 6.45 గంటలకు ఆస్పత్రికి తరలించే సమయంలోనే కన్నుమూశారు. రాకేష్ ఝున్ ఝున్ వాలా భార్య, ఇద్దరు…
అయితే జాతీయ జెండాను అగౌరవపరచడం నేరం అని మనలో ఎంత మందికి తెలుసు..? ముఖ్యంగా వేడుకలు ముగిసిన తర్వాత చిరిగిన, దెబ్బతిన్న జాతీయ పతాకాన్ని ఎంత గౌరవంగా పారేయాలనేది చాలా మందికి తెలియదు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2022లో పేర్కొన్న నిబంధనల ప్రకారం దెబ్బతిన్న జాతీయ పతకాన్ని రెండు పద్దతుల ద్వారా గౌరవంగా పారేయాలి. దహనం చేయడం లేదా పాతి పెట్టడం ద్వారా గౌరవంగా పారేయాలి.
Terrorists Grenade Attack In Jammu And Kashmir: భారత్ ఓ వైపు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సమయంలో దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని ఖైమో ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు.