Dalit boy beaten by teacher for drinking water, died: విద్యాబుద్ధులు నేేర్పాల్సిన టీచర్, సమసమాజ భావనను పెంపొందించాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయుడు ఓ దళిత బాలుడిపై దాడి చేసిన ఘటన రాజస్థాన్ లో తీవ్ర కలకలం రేపింది. కుండలోని నీరు తాగినందుకు తొమ్మిదేళ్ల బాలుడిని చితక్కొట్టాడు సదరు ఉపాధ్యాయుడు. ఈ ఘటన జూలై 20న జరిగింది. ఈ ఘటన రాజస్థాన్ జిల్లా జలలోర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. అయితే తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాలుడని గుజరాత్ అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న క్రమంలో శనివారం మరణించాడు.
జలోల్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బాధిత విద్యార్థి కుండలోని నీరు తాగడమే పాపమైంది. ఉపాధ్యాయుడు చైల్ సింగ్(40) ఆ బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో శనివారం బాలుడు మరణించాడు. విద్యార్థి మరణానికి కారణం అయిన ఉపాధ్యాయుడు చైల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై హత్య, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుడి మృతి బాధాకరమరని ఆయన ట్వీట్ చేశారు. జలోల్ ఎస్పీ అగర్వాల్లా నేతృత్వంలో పోలీస్ విచారణ జరుగుతోంది.
Read Also: Uttar Pradesh: ఇంటిపై పాకిస్తాన్ జెండా.. వ్యక్తి అరెస్ట్
ఈ ఘటనపై రాజస్థాన్ రాష్ట్ర విద్యాశాఖ విచాణ కమిటీని ఏర్పాటు చేసింది. రాజస్థాన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఖిలాడి లాల్ బైర్వా కూడా ఈ ఘటనై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనను త్వరగా విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాన్ని కలిసేందుకు ఎస్సీ కమిషనర్ ఆగస్టు 15న సురానా గ్రామానికి వెళ్లనున్నారు.