Pakistan: సింధు జలాలపై పాక్‌కు ఝలక్.. భారత్ దెబ్బకు విలవిల
- పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ
- సింధు జలాలపై భారత్ గట్టి షాక్
- ముప్పు తిప్పులు పడుతోన్న దాయాది దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింధు జలాల ఒప్పందం వివాదంలో పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత్ మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాల్గొనకపోవడంతో పాటు ఒప్పందాన్ని తాత్కాలికంగా అమల్లో లేకుండా ఉంచిన నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ విచారణ ఖర్చులన్నీ పాకిస్థానే పూర్తిగా భరిస్తోందని నివేదికలు అందుతున్నాయి. భారత్ చెల్లించాల్సిన వాటాను కూడా ఇస్లామాబాద్‌నే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా సింధు జలాల ఒప్పందం ప్రకారం.. మధ్యవర్తిత్వ విచారణల ఖర్చులను భారత్-పాకిస్తాన్‌లు సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. అలాంటిది భారత్ దూరంగా ఉండడంతో గత్యంతరం లేక పాకిస్థాన్ ఒక్కటే ఆ ఖర్చులను భరిస్తోంది.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (PCA) దగ్గర కొనసాగుతున్న ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్థాన్ ఇప్పటికే 6 లక్షల డాలర్లకు పైగా ఖర్చు చేసింది. విచారణ కొనసాగుతున్న కొద్దీ ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
సింధు జలాల ఒప్పందం ప్రకారం.. మధ్యవర్తిత్వ ప్రక్రియకు సంబంధించిన ఖర్చులను భారత్, పాకిస్థాన్ సమానంగా భరించాలి. అయితే 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాల్గొనడాన్ని నిలిపివేసింది. సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాదానికి పాకిస్థాన్ విశ్వసనీయమైన, శాశ్వత చర్యలు తీసుకునే వరకు ఒప్పందం అమల్లో ఉండదని భారత్ స్పష్టం చేసింది. అయినప్పటికీ పాకిస్థాన్ మాత్రం మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగిస్తూ.. రెండు దేశాల తరఫున చెల్లించాల్సిన ఖర్చులను కూడా తానే భరిస్తోందని సమాచారం.
వివాదం ఏంటి?
ఈ వివాదం ప్రధానంగా కిషన్‌గంగా-రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతోంది. సింధు జలాల ఒప్పందం పరిధిలోని పశ్చిమ నదులపై భారత్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులు ఒప్పందానికి విరుద్ధమని ఆరోపిస్తూ పాకిస్థాన్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. అయితే ఇలాంటి సాంకేతిక అంశాలను న్యూట్రల్ ఎక్స్పర్ట్ మాత్రమే పరిశీలించాలని, ఒకేసారి న్యూట్రల్ ఎక్స్‌పర్ట్‌తో పాటు ఆర్బిట్రేషన్ ప్రక్రియను కొనసాగించడం ఒప్పంద స్ఫూర్తికి విరుద్ధమని భారత్ వాదిస్తోంది.
పీసీఏ అధికారాన్ని తిరస్కరించిన భారత్
పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కు ఈ కేసును విచారించే అధికారం లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ ట్రైబ్యునల్‌ను ‘‘చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేశారు’’ అని పేర్కొంటూ.. దీనివల్ల వెలువడే తీర్పులు చెల్లవని భారత్ ప్రకటించింది. అయితే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిబంధనల ప్రకారం.. ఒక పక్షం విచారణకు హాజరు కాకపోయినా, ట్రైబ్యునల్‌కు అధికార పరిధి ఉందని భావిస్తే విచారణ కొనసాగించవచ్చు. ఈ నేపథ్యంలో పీసీఏ పాకిస్థాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు తనకు అధికారం ఉందని ప్రకటించింది. అయితే భారత్ మాత్రం ఇప్పటికీ ఈ ప్రక్రియకు దూరంగానే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ పాల్గొనని పరిస్థితి కొనసాగి.. పాకిస్థాన్ కేసును ముందుకు తీసుకెళ్తే.. మధ్యవర్తిత్వానికి సంబంధించిన మొత్తం ఖర్చును ఇకపై కూడా పాకిస్థానే భరించాల్సి వచ్చే అవకాశం ఉంది.
- Tags
- india
- Indus waters
- Pakistan
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!