Musharraf wanted to see Rahul Gandhi as PM: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మరణించారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. గతంలో పర్వేజ్ ముషారఫ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ హస్తం పార్టీపై విరుచుకుపడుతోంది. ఆదివారం తన సంతాప సందేశంలో ముషారఫ్ ను ప్రశంసించాడు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ బాలాకోట్ దాడులను అనుమానించిందని.. సొంత ఆర్మీ చీఫ్ ను గుండాగా అభివర్ణించిదని, కానీ భారత శతృవు ముషారఫ్ ను మాత్రం అభినందిస్తున్నారంటూ, ఒకప్పుడు ముషారఫ్, రాహుల్ గాంధీని పెద్ద మనిషి అని కొనియాడారంటూ ట్వీట్ చేశారు. ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్లను ప్రశంసించిన ముషారఫ్ రాహుల్ గాంధీని కూడా ప్రశంసించారు. రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు. కార్గిల్ యుద్ధానికి కారకుడిని కాంగ్రెస్ ప్రశంసించడానికి ఇదే కారణం అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు షెహజాద్ ట్వీట్ చేశాడు.
Read Also: CM KCR : బీఆర్‌ఎస్ అధికారంలో వస్తే.. దేశమంతా దళితబంధు
శశిథరూర్ తన ట్వీట్ లో.. ముషారఫ్ ఒకప్పుడు భారత్ కు శతృవు అని, అయితే అతను 2002, 2007 మధ్య ఆంతికి నిజమైన శక్తిగా మారాడని, ఆ రోజుల్లో యూఎన్లో నేను అతడిని ప్రతీ ఏడాది కలుసుకున్నానని పేర్కొన్నాడు. గతంలో ఓ ఇంటర్య్వూలో రాహుల్ గాంధీని ముషారఫ్ ప్రశంసించిన విషయాన్ని బీజేపీ ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించింది. 2019 లోక్ సభ ఎన్నికల ముందు ఓ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు, మోదీ శాంతి కోసం పనిచేసే మనిషి కాదు అంటూ వ్యాఖ్యలు చేశాడు.
రాహుల్ గాంధీ గురించి ప్రశ్నించగా.. ముషారఫ్, తన తల్లి, అన్నయ్య, కొడుకు ఢిల్లీ వెళ్లినప్పుడు రాహుల్ గాంధీ తన కొడుకును టీ కోసం ఆహ్మానించారని చెప్పారు. మన్మోహన్ సింగ్ తమ ముగ్గురిని భోజనానికి ఆహ్వానించినట్లు తెలిపారు. భారత్ తో క్రికెట్ మ్యాచ్ ను ప్రోత్సహించే వాడినని ముషారఫ్ అన్నారు.