ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ పాకిస్థాన్ స్టార్‌పై నిషేధం.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC: పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ ఐసీసీ (ICC) యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మూడు నెలల నిషేధానికి గురయ్యాడు. అయితే ఆయన ఒక డ్రగ్ అబ్యూజ్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేస్తే ఈ నిషేధ కాలాన్ని ఒక నెలకు తగ్గిస్తామని ఐసీసీ మీడియా ప్రకటన ద్వారా వెల్లడించింది. వాస్తవానికి.. 2026 ఫిబ్రవరి 7న శ్రీలంకలోని కొలంబోలో నెదర్లాండ్స్‌తో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసిన తర్వాత 32 ఏళ్ల మహ్మద్ నవాజ్‌కు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతను నిషేధిత పదార్థం అయిన ‘కార్బాక్సీ-టిహెచ్‌సి’ (Carboxy-THC) పాజిటివ్‌గా తేలింది. దీనిపై స్పందించిన నవాజ్, తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. అయితే ఈ పదార్థాన్ని తాను మ్యాచ్‌లు లేని సమయంలో (అవుట్-ఆఫ్-కాంపెటీషన్) తీసుకున్నానని, ఆటకు లేదా తన ప్రదర్శనకు దీనికి ఎలాంటి సంబంధం లేదని అతను నిరూపించుకోగలిగాడు.
నవాజ్ తన తప్పును ఒప్పుకోవడంతో పాటు.. మే 1, 2026 నుంచి స్వచ్ఛందంగా తాత్కాలిక సస్పెన్షన్‌లోకి వెళ్లాడు. దీంతో అతని మూడు నెలల నిషేధ కాలాన్ని మే 1 నుంచే అమలు చేసినట్లు ఐసీసీ పరిగణించింది. నిబంధనల ప్రకారం అతను వ్యసన విముక్తి కార్యక్రమానికి హాజరు కావడానికి అంగీకరించడంతో ఇప్పటికే రెండున్నర నెలల సస్పెన్షన్ కాలాన్ని పూర్తి చేసుకున్న నవాజ్‌పై ఉన్న తాత్కాలిక సస్పెన్షన్‌ను ఐసీసీ ఎత్తివేసింది. ఐసీసీ సంతృప్తి చెందేలా సదరు ట్రీట్మెంట్ ప్రోగ్రామ్‌ను నవాజ్ పూర్తి చేస్తే.. అతను భవిష్యత్తులో ఎలాంటి అదనపు నిషేధ కాలాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అయితే, ఐసీసీ యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం.. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పాటు, ఆ తర్వాత మే 1, 2026 వరకు నవాజ్ ఆడిన అన్ని మ్యాచ్‌ల రికార్డులను, గణాంకాలను ఐసీసీ రద్దు (డిస్క్వాలిఫై) చేసింది.
Also Read
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?