“Public Is The Master…”: Law Minister’s Latest Swipe At Supreme Court: కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య కొన్ని రోజులుగా పంచాయతీ నెలకొంది. సుప్రీంకోర్టు కోలిజియం సిఫారసు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పదోన్నతుల వ్యవహారం గత రెండు నెలలుగా కేంద్రం పెండింగ్ లో ఉంచింది. అయితే నిన్న సుప్రీంకోర్టు దీనిపై ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. తాజాగా ఈ రోజు కేంద్రం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిథాల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అహ్సానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మనోజ్ మిశ్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించింది.
Read Also: V.Hanumantha Rao : మోడీ ప్రధాని అయ్యాక.. సామాన్యులకు ఒరిగింది ఏమి లేదు
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై మరోసారి న్యాయశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సుప్రీంకోర్టుపైనే సెటైర్లు పేల్చారు. ఈ రోజు జరిగిన ఓ కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చిందని నేను వార్తల్లో చూశానని.. దీన్ని చూసి కొంతమంది నవ్వుకున్నారని అన్నారు. కానీ ‘‘ఈ దేశానికి యజమానులు ఈ దేశ ప్రజలే, మనం కార్మికులం మాత్రమే. యజమాని అంటే దేశ ప్రజలే అని, మార్గదర్శి రాజ్యాంగమే, రాజ్యాంగం ప్రకారం ఈ దేశం ప్రజలు కోరుకున్నట్లు నడపిండి. మీరు ఎవరికీ వార్నింగ్ ఇవ్వలేరు’’ అని అన్నారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో సహా 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కొలీజియం వ్యవస్థ ఇటీవల కేంద్రం, న్యాయవ్యవస్థల మధ్య వివాదానికి కారణం అయింది. దీనిలో ప్రభుత్వం భాగస్వామ్యం కూడా ఉండాలని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.
#WATCH | I saw a media report today that stated- Supreme Court has given a warning…The Indian Constitution is our guide. No one can give a warning to anyone: Union Law Minister Kiren Rijiju in Prayagraj, UP pic.twitter.com/oyoDfzLzIS
— ANI (@ANI) February 4, 2023