Italian mafia boss worked as pizza chef in France: ఎడ్గార్డో గ్రీకో ఇటాయన్ మాఫియా డాన్. కానీ గత 16 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అతను తన ఐడెంటిటీని దాచి ఫ్రాన్స్ లో ఓ పిజ్జా రెస్టారెంట్ లో గత మూడేళ్లుగా చెఫ్ గా పనిచేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కాఫీ రోస్సీని అనే రెస్టారెంట్ ఫ్రాన్స్ లోని సెయింట్ ఎటిఎన్నేలో ఉంది. దాంట్లో పిజ్జా చెఫ్ గా పాలో డిమిట్రియో ఉన్నారు. అయితే ఇతడే ఇటలీలో దారుణమైన హత్యలకు పాల్పడిన మాఫియా డాన్ ఎడ్గార్డో గ్రీకో అని తేలింది.
Read Also: Dadisetti Raja: యనమలకు దాడిశెట్టి సవాల్.. తమ్ముడితో ఆ పని చేయించగలవా?
గ్రీకో ఇటలీలో పేరు మోసిన డ్రంగెటా క్రైమ్ గ్రూపుతో సంబంధాలు కలిగి ఉన్నాడు. 63 ఏళ్ల గ్రీకో ఇద్దరిని తీవ్రంగా కొట్టి, యాసిడ్ లో కరిగించి చంపేసిన నేరంలో దోషిగా తేలాడు. గత 16 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. గురువారం ఇతడిని పోలీసులు రెస్టారెంట్ లో అదుపులోకి తీసుకున్నారు. 1990ల ప్రారంభంలో జరిగిన మాఫియా గ్రూపుల మధ్య ఆధిపత్య పోరులో గ్రీకో ఈ హత్యలు చేశాడు. మరో మాఫియా డాన్ మాటియో మెస్సినా డెనారో ఇటలీలోని పలెర్మోలోని హెల్త్ క్లినిక్ లో పట్టుబడ్డ రెండు వారాల తర్వాత గ్రీకోను అరెస్ట్ చేశారు.
మూడు సంవత్సరాలుగా పిజ్జా చెఫ్ గా పనిచేస్తున్నాడు గ్రీకో. రెస్టారెంట్ తన ఫేస్ బుక్ పేజీలో ఓ కథనాన్ని పోస్ట్ చేసింది. ఇది చూసిన పోలీసులు మాఫియా బాస్ గ్రీకోను గుర్తించారు. డ్రంగెటా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కొకైన్ అక్రమ రవాణా చేసే మాఫియా. యూరప్ అంతటా, బ్రెజిల్ దేశంలో కూడా దీని మూలాలు ఉన్నాయి.