Agniveer recruitment: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్మీలో ‘అగ్నివీర్’ పథకాన్ని తీసుకువచ్చింది. దీనిపై పలు పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చినా.. హింసాత్మక చర్యలకు పాల్పడిని కేంద్ర వెనక్కి తీసుకోలేదు. అయితే అగ్నివీర్ పథకానికి యువత నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. పెద్ద ఎత్తున యువకులు అగ్నివీరులుగా మారడానికి అప్లై చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అగ్నివీర్ రిక్రూట్మెంట్ పథకంలో మార్పులు చేయబోతోంది సైన్యం.
ఇండియన్ ఆర్మీ ఫోర్స్‌లో చేరాలనుకునే అభ్యర్థుల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పులను ప్రకటించింది. ఈ పథకం కింద సైన్యంలో చేరాలనుకునే వారు ముందుగా ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ)కి హాజరుకావాలి. ఆ తరువాత ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఫిబ్రవరి మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Read Also: CM KCR : సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర నేతలు భేటీ..
అంతకుముందు అగ్నివీర్ రిక్రూట్మెంట్ లో అభ్యర్థులు మొదటగా ఫిజికల్ ఫిట్ నెస్, ఆ తరువాత మెడికల్ టెస్టులకు హాజరయ్యేవారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ తరువాత మెరిట్ జాబితా ఆధారంగా శిక్షణకు ఎంపికయ్యేవారు. అయితే ఫిజికల్, మెడికల్ టెస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ర్యాలీలను నిర్వహించడంలో అయ్యే ఖర్చులను తగ్గించడానికి ఎంపిక ప్రక్రియలో మార్పు చేసినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ప్రవేశ అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఫిజికల్, మెడికల్ టెస్టులకు హాజరుఅవుతారు. దీంతో పరిపాలన, రవాణా ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్నారు.
గతంలో ఉన్న రిక్రూట్మెంట్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ స్క్రీనింగ్ కేంద్రాల వద్ద లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తుండటంతో ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. 2023-24 తదుపరి రిక్రూట్‌మెంట్ నుండి సైన్యంలో చేరేందుకు సిద్ధంగా ఉన్న దాదాపు 40,000 మంది అభ్యర్థులకు కొత్త ప్రక్రియ వర్తిస్తుంది. మొదటి ఆన్‌లైన్ సీఈఈ ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 200 స్థానాల్లో నిర్వహించే అవకాశం ఉంది.