Man Carry Father To Hospital On Handcart in madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశాఖ పనితీరు ఎంత దారుణంగా ఉందో చూపించే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్స్ లేకపోవడంతో తమ వాళ్ల మృతదేశాలను బైకులపై తీసుకువెళ్లిన ఘటనలు చూశాం. చివరకు ఓ ఏడేళ్ల చిన్నవాడు తన తమ్ముడి మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని రోడ్డు పక్కన ఉన్న ఘటన కూడా మధ్యప్రదేశ్ మొరేనాలో చోటు చేసుకుంది.
Teenager Kidnapped And physically molested In Goa: ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా మరోసారి గోవా, యూపీ రాష్ట్రాల్లో అత్యాచార కేసులు వెలుగులోకి వచ్చాయి.
Rahul Gandhi targets PM over release of Bilkis Bano case convicts: బిల్కిస్ బానో అత్యాచార ఘటనలో నిందితులుగా ఉన్న 11 మందిని విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఫైర్ అవుతోంది. గ్యాంగ్ రేప్, హత్యలు చేసిన నిందితులను సత్ప్రవర్తన ద్వారా విడుదల చేయడంపై బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. నారీ శక్తి అని స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రసంగించిన ప్రధాని మోదీ కొన్ని గంటల్లోనే మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను విడుదల…
Protests Against CAA: దాదాపుగా సుదీర్ఘ విరామం తరువాత వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం( సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఏఏఎస్‌యూ) సీఏఏకు వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఎన్ఈఎస్ఓ) ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపింది.
Varicose Veins - Modern Treatments: వేరికోస్ వెయిన్స్ వ్యాధి వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే చాలా మందిలో ఈ వ్యాధికి చికిత్స లేదనే భ్రమలో ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వ్యాధిని నయం చేయడానికి అనేక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.
Most of Bihar's ministers Face Criminal Cases: బీహార్ లో ఎన్డీయేతో ఉన్న జేడీయూ పార్టీ ప్రస్తుతం ఆర్జేడీతో మహాఘటబంధన్ కూటమిని ఏర్పాటు చేసింది. దీంతో జేడీయూతో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంగా మారింది. నితీష్ కుమార్ రాజీనామా చేసి.. మళ్లీ ఆర్జేడీ మద్దతుతో ముఖ్యమంత్రిగా బీహార్ సీఎంగా బాధ్యతలు తీసుకోగా.. ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల 31 మంత్రులతో బీహార్ కేబినెట్ కొలువు తీరింది.
CWC Meeting: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) గురువారం భేటీ కాబోతోంది. రేపు సాయంత్రం 5.30 నిమిషాలకు సోనియా అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రేపు జరగబోయే సీడబ్ల్యూసీ మీటింగ్ లో అధిక ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 28న ఢిల్లీలో రాంలీలా మైదానంలో నిర్వహించబోతోన్న ర్యాలీ గురించి కూడా చర్చించనున్నారు.
Bengaluru is among the six best emerging cities in the world: భారత నగరాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూర్ ఒకటి. భారత సిలికాన్ వ్యాలీగా, సాఫ్ట్ వేర్ రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూర్ ఇప్పుడు ప్రపంచం దృష్టి కూడా ఆకర్షిస్తోంది. తాజాగా బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ స్థాయి నగరాల్లో బెంగళూర్ కూడా ఉంది. బ్లామ్ బెర్గ్ ప్రకారం వరల్డ్ ఎమర్జెంగ్ సిటీల జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ఆరు…
Supreme Court Key Comments on Freebies: రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై బుధవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలపై వాడీవేడీ చర్చ జరిగింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం ఉచితాలపై పలు వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ఉచిత పథకాలకు వ్యతిరేకంగా తన వాదనలను కొనసాగింది. అయితే ‘ ఉచితాలు’ అంటే ఏమిటని సుప్రీం ప్రశ్నించింది. బీజేపీ నాయకుడు, న్యాయవాది అయిన అశ్విని ఉపాధ్యాయ్ వేసిన పిల్.. ఇప్పుడు ఉచితాలపై…
parliamentary party board, No place for Yogi, Nitin Gadkari: బీజేపీ 2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది. దీంతో బీజేపీలో అత్యన్నత నిర్ణయాధికార కమిటీ అయిన కేంద్ర పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షుడిగా... ప్రధాని నరేంద్రమోదీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ లాల్పురా, లోక్‌సభ మాజీ ఎంపీ సత్యన్నారాయణ, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా…