Pak PM Shehbaz Sharif comments on ties with India, Kashmir issue: మరికొన్ని రోజుల్లో దాయాది దేశం పాకిస్తాన్, శ్రీలంక పరిస్థితికి చేరుతుందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే స్థితిలో లేని పాక్.. మళ్లీ కాశ్మీర్ రాగం ఎత్తుకుంటోంది. భారత్ తో పాక్ వ్యాపార, వాణిజ్య సంబంధాలు మునుపెన్నడూ లేని విధంగా కనిష్టా స్థాయికి చేరాయి. భారత్ తో సంబంధాలను తెంచుకన్న తరువాత పాక్ లో టమాటోలు, గోధుమ పిండి ధరలు ఎలా పెరిగాయో గతంలో చూశాం.
ఇదిలా ఉంటే ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి భారత్ తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కాశ్మీర్ మెలిక పెట్టారు. భారత్ తో శాంతియుత సంబంధాలు కోరుకుంటూన్నాం అంటూనే.. కాశ్మీర్ సమస్య పరిష్కారం మాట్లాడారు. సమానత్వం, న్యాంయ, పరస్పర గౌరవం ఆధారంగా భారత్ తో శాంతియుత సంబంధాలను పాకిస్తాన్ కోరుకుంటోందని.. యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ తీర్మాణాలకు, కాశ్మీరీ ప్రజల కోరికలకు అనుగుణంగా జమ్మూ కాశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారం అనివార్యమని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వానికి అంతర్జాతీయ సమాజం కీలక పాత్ర పోషించాలని షహజాబ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ లో కొత్తగా నియమితులైన ఆస్ట్రేలియన్ హైకమిషనర్ నీల్ హాకిన్స్ తో గురువారం సమావేశం అయిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Asia Cup 2022: పాకిస్థాన్‌పై భారత్‌దే గెలుపు.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జోస్యం నిజమవుతుందా?
అయితే ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో పాకిస్తాన్ తో సంబంధాలు కోరుకుంటున్నట్లు భారత్ పదేపదే పాకిస్తాన్ కు చెప్పింది. అయినా అది దాని బుద్ధి మార్చుకోవడం లేదు. కాశ్మీర్ లో సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడంతో పాటు భారత్ లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ వేస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులు ఓటు హక్కు కల్పిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370, 34 ఏ తొలగించిన తర్వాత భారత్ – పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల పేరుతో భారత్ జనాభా మార్పులకు పాల్పడుతోందని.. ఇటీవల పాక్ విదేశాంగ కార్యాలయం ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి ఫలితాలను ప్రభావితం చేయాలని భారత్ ప్రయత్నిస్తోందని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. జమ్మూ కాశ్మీర్లో కొత్తగా 25 లక్షల మంది ఓటుహక్కు పొందే అవకాశం ఉందని జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఇటీవల ప్రకటించారు.