Head Wound Dressed With Condom Pack In Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉందో ఇటీవల జరుగుతున్న ఘటనలు బయటపెడుతున్నాయి. అంబులెన్స్ లేకపోవడంతో తల్లి శవాన్ని, కుమారుడి శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన ఘటనలు మధ్యప్రదేశ్ లోనే వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ మొరేనాలో ఓ ఎనిమిదేళ్ల పిల్లవాడు..తన రెండేళ్ల తమ్ముడి శవాన్ని తన ఒళ్లో పడుకోబెట్టుకున్న ఫోటోలు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఆ పిల్లాడి పరిస్థితి చాలా మందితో కంటతడి పెట్టించింది. తండ్రి, తన కుమారుడి శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వాహనం కోసం బయటకు వెళ్లిన సందర్భంతో తన తమ్ముడి శవంతో ఏనిమిదేళ్ల బాలుడు ఉండటం మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను ప్రశ్నించింది.
Read Also: Finland PM Sanna Marin Drug Test: ఫిన్లాండ్ పీఎంకు డ్రగ్ టెస్ట్.. పార్టీకి వెళ్లి చిందేసినందుకే
తాజాగా మరో ఘటన మధ్యప్రదేశ్ ఆరోగ్యవ్యవస్థ ఎలా ఉందో తెలియజేస్తోంది. రాష్ట్రంలోని మొరేనా జిల్లాలో ఓ మహిళ తలకు గాయాలతో పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వచ్చింది. ఆ సమయంలో తల గాయం వల్ల రక్త ఎక్కువగా పోతుండటంతో డ్యూటీ డాక్టర్ ధర్మేంద్ర రాజ్ పుత్ డ్రెస్సింగ్ చేశారు. అయితే డ్రెస్సింగ్ సమయంలో గాయానికి చికిత్స అందిస్తున్న సమయంలో రక్తాన్ని అపడానికి కాటన్ తో పాటు, తాత్కాలికంగా కట్టు కట్టడానికి మహిళ తపపై కండోమ్ రేపర్ ను కట్టాడు. మహిళ గాయం తీవ్రత దృష్ట్యా మొరేనా జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేసిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ధర్మఘర్ నుంచి వచ్చిన ఆ మహిళను రేష్మా బాయిగా గుర్తించారు అధికారులు. తలకు గాయం అయినప్పుడు డాక్టర్ కాటన్ పై ఎదైనా గట్టిగా ఉండే కార్డ్ బోర్డ్ పెట్టమని వార్డ్ బాయ్ కి సూచించాడు. అయితే వార్డ్ బాయ్ కండోమ్ ప్యాకెట్ ను ఉంచాడు. ఇది జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి డ్రస్సన్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.