Physical attack on Tamil Nadu teenage girl.. Accused gets life: ఓ టీనేజ్ బాలికను లైంగికంగా వేధింపులలకు పాల్పడటంతో పాటు.. ఆమెను వ్యభిచారంలోకి దింపిన కేసులు తమిళనాడు ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించగా..ఓ పోలీస్ అధికారి, జర్నలిస్టు, బీజేపీ కార్యకర్తలతో పాటు 13 మందికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
Supreme Court On shivsena party issue: మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కొనసాగుతోంది. అసలైన శివసేన ఎవరిదనే ప్రశ్నకు ఇక కేంద్ర ఎన్నికల సంఘమే సమాధానం ఇవ్వనుంది. తాజాగా సుప్రీంకోర్టులో మాజీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ తాకింది. శివసేన పార్టీపై ఇటు ఏక్ నాథ్ షిండే వర్గం, అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే తాజాగా మంగళవారం రోజు ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
India sends strong message to Pakistan on forcible conversion of Sikh teacher: ఏ అంతర్జాతీయ వేదికపైన కూడా పాకిస్తాన్ కేవలం భారత వ్యతిరేక మాటలే చెబుతోంది. కాశ్మీర్ లో మైనారిటీల హక్కుల గురించి మాట్లాడే దాయాది దేశం తన దేశంలో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవుల హక్కులను పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ పలు ప్రావిన్సుల్లో మైనారిటీకి చెందిన మహిళలు, బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చారు.
Wife can terminate pregnancy without husband’s approval says kerala high court: కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహిత మహిళలు గర్భం దాల్చడం ఆమె ఇష్టం అని హైకోర్టు పేర్కొంది. దీనికి భర్త అనుమతి అవసరం లేదని చెప్పింది. ప్రసవ సమయంలో ఒత్తడిని, ఆ బాధను అనుభవించేది స్త్రీనే అని కీలక వ్యాఖ్యలు చేసింది. గత గర్భాన్ని తొలగించాలని 21 ఏళ్ల మహిళ కేరళ హైకోర్టును అభ్యర్థించింది. దీనిపై కేరళ హైకోర్టులో సోమవారం వాదనలు నడిచాయి. వివాహిత స్త్రీ తన…
Husband killed his wife for not wearing a burqa: ఓ వైపు హిజాబ్ వద్దు అంటూ కరడుగట్టిని ఇస్లామిక్ దేశం ఇరాన్ లో ఉద్యమాలు జరుగుతున్నాయి. మహ్సా అమిని అనే యువతి హిజాబ్ ధరించనుందుకు పోలీసులు అరెస్ట్ చేయడం ఆ తరువాత అమ్మాయి చనిపోవడంతో అక్కడి యువత, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. హిజాబ్ విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే మనదేశంలో మాత్రం కొంతమంది ఇష్టం లేకున్నా హిజాబ్, బురఖా…
Madhya Pradesh Government's key decision to stop Love Jihad: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ యువతులు లవ్ జీహాద్ కోరల్లో చిక్కుకుంటున్నారని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కొంతమంది హిందూ మహిళల్ని ప్రేమ పేరుతో వంచిస్తున్నారని బీజేపీ, హిందూ సంస్థల నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం దసరా ఉత్సవాల్లో జరిగే గర్బా డ్యాన్స్ ఉత్సవాలకు వెళ్లేవారిపై నిఘా పెట్టాలని భావిస్తోంది.
NIA raids on PFI in 8 states: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మరోసారి దాడులు నిర్వహించింది. గత వారం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ రాడికల్ ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐపై దాడులు చేసి 106 మంది అగ్రనాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. తాజాగా మంగళవారం 8 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ దాడుల చేసింది. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది.
Putin Grants Russian Ctizenship To US's Edward Snowden: అమెరికాకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా పౌరసత్వం మంజూరు చేస్తూ సోమవారం డిక్రీపై సంతకం చేశారు. 39 ఏళ్ల స్నోడెన్ అమెరికా నుంచి పారిపోయి రష్యాలో తలదాచుకుంటున్నాడు. 2013లో అమెరికా రహస్య ఫైళ్లను లీక్ చేసిన తర్వాత రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు.
Kerala A Hot Spot of Terrorism says jp nadda: కేరళలో తీవ్రవాదం ఎక్కువ అయిందని.. ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారిందని.. ఇక్కడ జీవితం సురక్షితంగా లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేరళలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబం కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆరోపించారు. వామపక్షాలు కుటుంబ, రాజరిక పాలనలో పడిపోయాయని ఆరోపించారు. పినరయి విజయన్ కూతురు, అల్లుడు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
Tamil Nadu Cabinet approves ordinance to ban online gambling in state: ఆన్లైన్ గేమింగ్ పిల్లలు, యువతపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ గేమింగ్ నిషేధించాలని భావిస్తున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం ఆన్లైన్ గేమింగ్ ను నిషేధిస్తూ.. రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆర్ధినెన్స్ కు ఆమోదం తెలిపింది. తమిళనాడు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత రాష్ట్రంలో ఆర్డినెన్స్ అమలులోకి రానుంది.