Gold seizure in Delhi: ఢిల్లీలో భారీగా బంగారం పట్టుబడింది. ఈశాన్య ఢిల్లీలో డీఆర్ఐ అధికారులు రూ.33.40 కోట్ల విలువ చేసే 65.46 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఐజ్వాల్ నుంచి ముంబాయి వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లో బంగారాన్ని గుర్తించిన పాట్నా, ఢిల్లీ, ముంబాయి డీఆర్ఐ స్పెషల్ టీములు గుర్తించాయి. గోనే సంచుల్లో బంగారం తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు పక్కా ప్లాన్ తో గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేశారు.
Death threat to Mukesh Ambani Family: రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ అధినేత, మల్టీ బిలియనీర్ ముకేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు ఆగంతకులు. బుధవారం మధ్యాహ్నం, 12.57 నిమిషాలకు సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ల్యాండ్ లైన్ నెంబర్ కు తెలియన నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆస్పత్రిని పేల్చేస్తామని హెచ్చరించారు. అంబానీ కుటుంబంలోని కొంతమందిని చంపేస్తామని బెదిరించారు.
Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో విశేష కృషికి గానూ.. ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్తోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధికి గానూ కరోలిన్ బెర్టోజీ, మోర్టెన్ మెల్డార్, బారీ షార్ప్లెస్ నోబెల్ బహుమతి అందుకున్నారు. ఇంజనీరింగ్ టూల్స్ ఫర్ మాలుక్యూల్స్ బిల్డింగ్స్ పై వీరంతా పరిశోధనలు చేశారు. బారీ షార్ప్ లెస్, మోర్టెన్ మెల్డల్ క్లిక్ కెమిస్ట్రీ క్రియాత్మక రూపానికి పునాది వేశారు. పరమాణు బిల్డింగ్స్ బ్లాక్స్ పై పరిశోధనలు చేశారు. కరోలిన్ బెర్టోజీ వీటిని జీవులలో ఉపయోగించడం…
No talks with Pakistan Says Amit Shah: జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాకిస్తాన్ పై, జమ్మూ కాశ్మీర్లో గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తో ఎలాంటి చర్చలు ఉండవని.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్లటి.. దేశంలో అత్యంత ప్రశాంత ప్రదేశాంగా మారుస్తుందని నొక్కి చెప్పారు. బారముల్లాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్…
Earthquake Hits Iran: ఇరాన్ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. వాయువ్య ఇరాన్ లోని పశ్చిమ అజార్ బైజార్ ప్రావిన్సులోని భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 528 మంది గాయపడ్డారు. 135 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. భూకంపం ధాటికి 12 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు.
RSS Chief Mohan Bhagwat comments on Religion-Based Population Imbalance: దసరా సందర్భంగా నాగ్ పూర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యక్రమంలో చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మత ఆధారిత జనాభా అసమతుల్యతను విస్మరించలేమని అన్నారు. జనాభా నియంత్రణ విధానాలకు పిలుపునిచ్చారు మోహన్ భగవత్. జనాభా అసమతుల్యత దేశ విభజనకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. కసావో, దక్షిణ సూడాన్ వంటి దేశాలు జనాభా అసమతుల్యత కారణంగా విడిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
Uttarakhand Avalanche Incident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. హిమాలయాల్లో పర్వతారోహనకు వెళ్లిన 28 మంది హిమపాతంలో చిక్కుకున్నారు. నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో 28 మంది ట్రైనీ పర్వతారోహకులు చిక్కుకుపోయారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఇందులో 20 మంది వరకు మరణించినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీటీకి చెందిన బలగాలు సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సహాయక, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్లు సీఎం వెల్లడించారు. ద్రౌపది దండ-2 శిఖరం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
15 killed in Ecuador prison violence: లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్ లోని ఓ జైలులో ఖైదీల మధ్య తీవ్రఘర్షణ చెలరేగింది. ఈక్వెడార్ లోని లటాకుంగాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణల కారణంగా 15 మంది ఖైదీలు మరణించారు. ఈ ఘర్షణల కారణంగా మరో 21 మంది గాయపడ్డారు. మాదకద్రవ్యాల రవాణా మార్గాలపై ముఠాల మధ్య ఘర్షణకు కారణమయ్యాయని అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో అన్నారు. ప్రస్తుతం అధికారులు మృతదేశాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇతర ప్రావిన్సుల్లో భద్రతను పెంచామని అధికారులు వెల్లడించారు.…
Loan app Harassment.. IT employee forced to die: లోన్ యాప్ ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రుణం చెల్లించానా.. ప్రజలను జలగల్లా పట్టి పీల్చిపిప్పి చేస్తున్నారు. లోన్ యాప్ ఆగడాల వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది బాధితులు తనువుచాలించారు. లోన్ యాప్ నిర్వాహకులు పెట్టే వేధింపులు, అసభ్యకరమైన మాటలు తట్టుకోలేక చాలా మంది లోలోపల కుమిలిపోతున్నారు. చాలా మంది ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా చెన్నైకు చెందిన ఐటీ ఉద్యోగి లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Trump sues CNN claiming defamation: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎన్ఎన్ మీడియా సంస్థపై ఏకంగా 475( సుమారుగా 3,900కోట్లు) మిలియన్ డాలర్లకు పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా సీఎన్ఎన్ వార్తకథనాలు ప్రచురించిందని కోర్టులో సమర్పించిన వ్యాజ్యంలో పేర్కొన్నారు ట్రంప్. తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తకథనాలను ప్రచారం చేసిందని పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టులో 29 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.