Sonia Gandhi To Join Bharat Jodo Yatra On Thursday: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ఆ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను మొదలుపెట్టారు. తమిళనాడులో ప్రారంభం అయిన ఈ యాత్ర కేరళ మీదుగా ప్రస్తుతం కర్ణాటక చేరుకుంది. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రతో మమేకం అవుతున్నారు.
Dalit Boy Tied To Electric Pole, Thrashed For Alleged Theft: దళిత బాలుడిపై కర్కశంగా ప్రవర్తించారు. దొంగతనం ఆరోపణలతో విద్యుత్ స్తంభానికి కట్టేసి చావబాదారు. అడ్డొచ్చిన బాలుడి తల్లిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనల కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 14 ఏళ్ల బాలుడు చెవిపోగును దొంగిలించడనే ఆరోపణలపై పది మంది వ్యక్తుల బాలుడిని చావబాదారు. సెప్టెంబర్ 29న బెంగళూర్ సమీపంలోని దళిత వర్గానికి చెందిన బాలుడు యశ్వంత్ చెవిపోగును దొంగిలించాడని ఉన్నత వర్గం వారు ఆరోపించారు.
Pope Francis Comments on Russia-Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాన్ని ముగించాలని..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలకు విజ్ఞప్తి చేశారు. యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. ఇంకెంత రక్తపాతం జరగాలని ప్రశ్నించారు. శాంతి కోసం ఇరుదేశాలు కట్టుబడి ఉండాలని సూచించారు. తన సొంత ప్రజల కోసం, ఈ యుద్ధాన్ని పుతిన్ ఆపాలని కోరారు. ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న బాధను చూసి చింతిస్తున్నాని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి కోసం సిద్ధంగా ఉండాలని ప్రతిపాదించారు.
Bihar Agriculture Minister Sudhakar Singh resigns: బీజేపీని కాదని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో కలిసి బీహార్ లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జేడీయూ నుంచి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఆర్జేడీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా మహాగటబంధన్ ప్రభుత్వంలో భాగంగా ఉంది. ఈ మూడు పార్టీలు మంత్రివర్గంలో భాగంగా ఉన్నాయి.
Heavy drugs and gold seized at Mumbai airport: మాదకద్రవ్యాలు, బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతున్నాయి విమానాశ్రయాలు, పోర్టులు. ఇటీవల కాలం దేశంలో పలు విమానాశ్రయాల్లో అక్రమంగా ఇండియాలోకి తీసుకువస్తున్న డ్రగ్స్ ను పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు. అధికారుల కళ్లుగప్పి నిషేధిత డ్రగ్స్ ను ఆఫ్రికా దేశాలు, ఆగ్నేయాసియా దేశాల నుంచి ఇండియాలోకి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే డ్రగ్స్ తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి బంగారాన్ని కూడా అక్రమ మార్గాల ద్వారా మనదేశంలోకి తీసుకువస్తూ పట్టుబడుతున్నారు.
Mulayam Singh Yadav's condition critical: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. ఆదివారం ఆయన్ను గురుగ్రామ్ లోని మెదాంత ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు. 82 ఏళ్ల ములాయం సింగ్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి ఆరోగ్యంపై సమాచారం అందిన వెంటనే ఉత్తర్ ప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ హుటాహుటిన లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరారు.
Bullet pierces through Myanmar plane mid-air in Myanmar:మయన్మార్ దేశంలో ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోంచి దించి అక్కడ సైన్యం అధికారాన్ని చేపట్టింది. ఆంగ్ సాంగ్ సూచీని అరెస్ట్ చేసి జుంటా ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఆ దేశంలో ప్రజాస్వామ్యం కోరుకుంటున్న వారికి, సైన్యానికి మధ్యలో తీవ్ర సంఘర్షణ జరుగుతోంది. పలు రెబెల్ గ్రూపులు, సైన్యానికి వ్యతిరేకంగా పోరు సాగిస్తున్నాయి. దీంతో అక్కడ కాల్పులు నిత్యకృత్యంగా మారాయి.
Marriage of minor daughter for money in Tamil Nadu: కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే కర్కశంగా మారుతున్నారు. సొంత కూమార్తె అనే ధ్యాస లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. మరికొంత మంది తమ కూతుర్లను డబ్బుల కోసం అమ్ముతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా తాగుడుకు బానిసైన ఓ తండ్రి తన సొంత కుమార్తె జీవితాన్ని చిదిమేసే ప్రయత్నం చేశాడు. డబ్బుల కోసం మైనర్ బాలికను వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని…
Shashi Tharoor Comments on Mallikarjun kharge: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అనేక రాజకీయ పరిణామాాల మధ్య అధ్యక్ష బరిలో మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్ ఉన్నారు. ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నిక ఏకభిప్రాయంతో కావాలని.. ఈ విషయాన్ని శశిథరూర్ కు చెప్పానని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు శశిథరూర్ కూడా తన ప్రచారాన్ని ప్రారంభించారు. మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీలో మార్పలు తీసుకురాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vande Mataram Instead Of Hello In New Campaign:మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. ఫోన్ కాల్స్ స్వీకరించేటప్పుడు ఇకపై హలోకు బదులుగా ‘వందేమాతరం’ చెప్పాలని ప్రజలకు మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ప్రచారాన్ని ప్రారంభించింది. వందేమాతరం అంటే.. మా అమ్మకు ముందు నమస్కరిస్తున్నామని అర్థం అని.. అందుకే ప్రజల్ని హలోకు బదులు వందేమాతరం చెప్పాలని కోరుతున్నామని సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ అన్నారు. వార్థాలో జరిగిన మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వందేమాతరం ప్రచారాన్ని ప్రారంభించారు.