Nobel Prize 2022: కెమిస్ట్రీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్.. “క్లిక్ కెమిస్ట్రీ” పరిశోధనలకు ప్రైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో విశేష కృషికి గానూ.. ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్తోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధికి గానూ కరోలిన్ బెర్టోజీ, మోర్టెన్ మెల్డార్, బారీ షార్ప్‌లెస్ నోబెల్ బహుమతి అందుకున్నారు. ఇంజనీరింగ్ టూల్స్ ఫర్ మాలుక్యూల్స్ బిల్డింగ్స్ పై వీరంతా పరిశోధనలు చేశారు. బారీ షార్ప్ లెస్, మోర్టెన్ మెల్డల్ క్లిక్ కెమిస్ట్రీ క్రియాత్మక రూపానికి పునాది వేశారు. పరమాణు బిల్డింగ్స్ బ్లాక్స్ పై పరిశోధనలు చేశారు. కరోలిన్ బెర్టోజీ వీటిని జీవులలో ఉపయోగించడం ప్రారంభించారు.
Read Also: BRS Party Sambaralu Live: బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో సంబరాలు
Also Read
- Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
- Pakistan: పాకిస్తాన్‌లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
ఇప్పటికే నోబెల్ కమిటీ సోమవారం వైద్యరంగం, మంగళవారం ఫిజిక్స్, తాజాగా బుధవారం కెమిస్ట్రీలో నోబెల్ బహుమతులను ప్రకటించింది. గురువారం సాహిత్యానికి, శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్ 10న ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతులు ప్రకటిస్తారు. 2021లో బెంజమిన్ లిస్ట్, డేవిడ్ మాక్ మిలన్ లకు సంయుక్తంగా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. పరమాణు నిర్మాణం కోసం కొత్త సాధనం ఆర్గానో క్యాటాలిసిస్ ను అభివృద్ధి చేసినందుకు నోబెల్ బహుమతి అందించారు.
నోబెల్ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్ క్రోనార్స్( 9 లక్షల డాలర్లు) నగదును అందచేస్తారు. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందచేస్తారు. స్వీడిష్ ఇంజినీర్ ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ నోబెల్ బహుమతులను అందిస్తోంది. ఇప్పటి వరకు కెమిస్ట్రీలో 113 మందికి నోబెల్ బహుమతులు రాగా.. అందులో ఏడుగురు మహిళలు ఉన్నారు.
Barry Sharpless has just become the fifth individual to be awarded two Nobel Prizes.
He follows in the footsteps of double #NobelPrize laureates John Bardeen, Marie Skłodowska Curie, Linus Pauling and Frederick Sanger.
Sharpless was awarded the chemistry prize in 2001 and 2022 pic.twitter.com/iQg0FL79zg
— The Nobel Prize (@NobelPrize) October 5, 2022
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..