Death threat to Mukesh Ambani Family: రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ అధినేత, మల్టీ బిలియనీర్ ముకేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు ఆగంతకులు. బుధవారం మధ్యాహ్నం, 12.57 నిమిషాలకు సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ల్యాండ్ లైన్ నెంబర్ కు తెలియన నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆస్పత్రిని పేల్చేస్తామని హెచ్చరించారు. అంబానీ కుటుంబంలోని కొంతమందిని చంపేస్తామని బెదిరించారు.
Read Also: Allu Aravind: ఆలీపై ఫైర్ అయిన అల్లు అరవింద్.. కాంట్రవర్సీ చేద్దామని పిలిచావా..?
ఈ ఫోన్ కాల్ పై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదు అయింది. అంతకుముందు కూడా అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆగస్టు 15న హెచ్ఎన్ రిలియన్స్ హాస్పిటల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఎనిమిది సార్లు కాల్స్ చేశాడు ఆగంతకుడు. అప్పుడు కాల్ చేసిన వ్యక్తిని దహిసర్ గా పోలీసులు గుర్తించి.. అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి బుధవారం బెదిరింపులు వచ్చాయి.
ఈ బెదిరింపు కాల్స్ ను ధృవీకరించారు ముంబై పోలీసులు. పోలీసులు మాట్లాడుతూ.. ఈ రోజు మధ్యాహ్నం 12.57 గంటలకు రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి బెదిరింపు కాల్స్ వచ్చాయని.. అందులో కాలర్ ఆస్పత్రిని పేల్చేస్తామని హెచ్చరించారని.. అంబానీ కుటుంబ సభ్యులను కొంతమందిని కూడా బెదిరించారని వెల్లడించారు. ఈ బెదిరింపు కాల్స్ పై విచారణ జరుగుతుందని అన్నారు.