Home Minister Amit Shah's visit to Jammu and Kashmir: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. అమిత్ షా తొలిసారిగా శ్రీ మాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంఝి చాట్ హెలిప్యాడ్ నుంచి కట్రా చేరుకున్నారు అమిత్ షా. ఆయన వెంట జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితెంద్ర సింగ్ ఉన్నారు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైష్ణోమాత ఆలయానికి రావడం…
Chidambaram Nataraja Temple issue:తమిళనాడులోని ప్రతిష్టాత్మక చిదంబర నటరాజ స్వామి ఆలయ సంపద వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వ చర్యలను పురోహితులు ఒప్పుకోొవడం లేదు. 1956 నుంచి ఆలయం సంపదను లెక్కలు చెప్పడానికి అర్చకులు ఒప్పుకోవడం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలకు, భక్తులకు పారదర్శకంగా ఉండేందుకు సంపద వివరాలను చెప్పాలని కోరుతోంది. ఈ వ్యవహారం స్టాలిన్ సర్కార్ వర్సెస్ అర్చకుల మధ్య వివాదంగా మారింది.
Dubai's new Hindu temple set to open ahead of Dussehra: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో హిందూ ఆలయం ప్రారంభం కానుంది. దుబాయ్ లో కొత్తగా నిర్మించిన ఈ ఆలయం దసరా ముందు రోజు మంగళవారం ప్రారంభం కానుంది. దుబాయ్ లోని జెబెల్ అలీ ప్రాంతంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. 2020లో శంకుస్థాపన జరిగిన ఈ దేవాలయం రెండేళ్ల తరువాత నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఈ కొత్త దేవాలయం గతంలో ఉన్న సింధీ గురుదర్భార్ ఆలయానికి పొడగింపు. సింధీ గురుదర్బార్ యూఏఈలోని…
4 Indian-Origin People Kidnapped In US: అమెరికాలో 8 ఏళ్ల పాపతో పాటు నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేశారు దుండగులు. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో సోమవారం ఈ ఘటన జరిగింది. కిడ్నాప్ అయిన వారిలో ఎనిమిది నెలల పాపతో పాటు ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్ తో పాటు వారి ఎనిమిది నెలల పాప అరూహి ధేరితో పాటు 39 ఏళ్ల అమన్ దీప్ సింగ్ ను దుండగులు కిడ్నాప్ చేశారు.
Another girl was killed in Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో మరో బాలికను హత్య చేశారు. ఔరయ్యా జిల్లా దిబియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో 17 ఏళ్ల బాలిక మృతదేహాన్ని నగ్నంగా గుర్తించారు పోలీసులు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మరణంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది. పోలీసులు మృతదేహంతో పారిపోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఓ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసింది.…
40 Arrested After Communal Clash In Gujarat: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సోమవారం వడోదరాలోని సావ్లి పట్టణంలోని ఓ కూరగాయాల మార్కెట్ వద్ద ఇరువర్గాలు మధ్య అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో వడోదల పోలీసులు మొత్తం 40 మందిని అరెస్ట్ చేశారు. సోమవారం సావ్లి పట్టణంలో ఓ వర్గం వారు మత జెండాలను ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టారు. దగ్లర్లో ఓ దేవాలయం ఉంది. దీంతో మరో వర్గం వారు నిరసన వ్యక్తం చేశారు.
North Korea Fires Missile Over Japan: ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. తాజాగా మంగళవారం కూడా ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్(ఐఆర్బీఎమ్)ను ప్రయోగించింది. జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించింది నార్త్ కొరియా. దీంతో జపాన్ లోని క్షిపణి హెచ్చరిక వ్యవస్థలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాయి. చివరి సారిగా 2017లో నార్త్ కొరియా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగాలు చేపట్టింది.
Stone Pelting During Navratri: గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న గర్బా డ్యాన్స్ వేదికపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఖేడా జిల్లాలోని మాటర్ తాలూకాలోని ఉండేలా గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో రాళ్లదాడి జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మరింత ఉద్రిక్తతలు తెలత్తకుండా పోలీసులు గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Mangalyaan Life ended: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళయాన్ జీవితం ముగిసింది. అతి తక్కవ బడ్జెట్ లో హాలీవుడ్ సినిమా ‘ గ్రావిటీ’ కన్నా తక్కువ బడ్జెట్ తో మార్స్ ఆర్బిటార్ మిషన్( ఎంఓఎం)ను రూపొందించి, విజయవంతంగా అంగారక గ్రహం వరకు తీసుకెళ్లడం ప్రపంచాన్ని ఆశ్చర్చపరిచింది. ప్రస్తుతం మార్స్ ఆర్బిటార్ గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు కోల్పోయిందని.. ఇకపై దానితో సంబంధాలు కొనసాగించే అవకాశం లేదని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
jammu kashmir DGP assassination: జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియాను దారుణంగా హత్య చేశారు. సోమవారం జమ్మూలోని అతని నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నారు. జమ్మూ శివార్లోని ఉదయ్ వాలా నివాసంలో గొంతు కోసి హత్య చేశారు. ఆ తరువాత తగలబెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయి. అతని పనిపనిచే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యను అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు…