Sanjay Raut Praises BJP's Devendra Fadnavis: పత్రాచల్ భూముల కుంభకోణంలో 103 రోజుల పాటు జైలులో ఉన్నాడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక నేత సంజయ్ రౌత్. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. అయితే నిన్న జైలు నుంచి విడుదలయ్యారు సంజయ్ రౌత్. బీజేపీ అంటేనే విరుచుకుపడే సంజయ్ రౌత్.. ఆ పార్టీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రశంసలు కురిపించారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత రూటు మార్చిన సంజయ్ రౌత్.. బీజేపీ…
5 Killed In Fire At Fireworks Godown In Madurai: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన గురువారం మధురై జిల్లాలోని తిరుమంగళం లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. అయితే ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా సింధుపట్టి పోలీసులు వెల్లడించారు.
Ravindra Jadeja Thanks PM After Wife Picked As Gujarat BJP Candidate: గుజరాత్ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 182 స్థానాలకు గానూ డిసెంబర్ 1, డిసెంబర్ 5వ తేదీన రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే గురువారం 160 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. దీంట్లో భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా పేరు కూడా ఉంది. దీంతో తమకు అవకాశం కల్పించినందుకు జడేజా…
Zomato Has A Hilarious Query For Rishi Sunak About India's Semi-Final Match: ఆస్ట్రేలియాలో జరగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ గురువారం జరుగుతోంది. అయితే ఈ మ్యాచులో ఇండియా గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్స్ లో పాకిస్తాన్ తో భారత్ తలపడాలని యావత్ క్రికెట్ ప్రపంచం కోరుకుంటోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు జోమాటో చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ పై నెటిజెన్లు పలు రకాలుగా…
Drunken Elephants: ఒడిశాలో విచిత్ర సంఘటన జరిగింది. ఏనుగుల గుంపు మద్యం తాగి గంటల తరబడి మత్తులో ఉన్నాయి. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం చుట్టు పక్కల ఉండే గ్రామస్తులు అటవీ ప్రాంతంలో తరుచుగా మద్యం తయారు చేస్తుంటారు. అటవీ ప్రాంతంలో దొరికే ఇప్పపూలు, ఇతర సామాగ్రితో సారా కాస్తుంటారు. ఇదిలా ఉంటే గ్రామస్తులు దాచిన ఇప్పసారాను తాగాయి 24 ఏనుగులు దీంతో అవన్నీ కొన్ని గంటల పాటు మత్తులో ఉండి నిద్రిస్తున్నాయి.
Chances High Of Big Earthquake In Himalayas: హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బుధవారం పశ్చిమ నేపాల్ లోని మారుమూల ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో ఆరుగురు మరణించారు. ఈ భూకంప ప్రకంపనలు భారత్ లో కూడా సంభవించాయి. ఉత్తరాఖండ్ తో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతాల్లో నాలుగు భారీ భూకంపాలు సంభవించాయి. రానున్న రోజుల్లో…
Supreme Court sensational comments against corrupt people: దేశంలో అవినీతిపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. భీమా కోరేగాం కేసులో అరెస్ట్ అయిన కార్యకర్త గౌతమ్ నావలఖ తన ఆరోగ్య సమస్యల దృష్ట్యా తనను జ్యుడిషియల్ రిమాండ్ నుంచి గృహ నిర్భంధంలోకి మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులు ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై బుధవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే గౌతమ్ నావలఖ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ జాతీయదర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తరుపున అదనపు సోలిసిటర్…
Twitter 'Official' Tick Starts Appearing on Verified Accounts in India: ట్విట్టర్ ని హస్తగతం చేసుకున్న తర్వాత కొత్త బాస్ ఎలాన్ మస్క్ పూర్తిగా ప్రక్షాళన చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ చివరి వారంలో ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత సీఈవో పరాగ్ అగర్వాల్ తో పాటు పాలసీ చీఫ్ విజయగద్దెలతో పాటు పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు 50 శాతం మంది ఉద్యోగులు అంటే 3700 మందిని తొలగిస్తూ గత శుక్రవారం నుంచి ప్రక్రియ ప్రారంభించారు. దీంతో పాటు…
Turmoil in the IT industry.. Crisis with layoffs: ఐటీ ఇండస్ట్రీ ప్రస్తుతం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది. నష్టాలను తగ్గించుకునేందుకు ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ పాటు పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించేస్తోంది. తాగా ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా కూడా 11,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఈ నిర్ణయం ఐటీ రంగ పరిస్థితులను తెలియజేస్తోంది. అంతర్జాతీయ, దేశీయ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను వదిలించుకునే ఆలోచనల్లో ఉన్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, వస్తున్న నష్టాలు ఐటీ…
Mahindra Partners With Three EV Infrastructure Firms to Build Charging Stations for Upcoming Vehicles: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పలు కంపెనీలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ కార్లులు, బైకుల ఉత్పత్తిని మరింగా పెంచతున్నాయి. ఇప్పటికే టాటా, ఎంజీ, మహీంద్రా, కియా, హ్యుందాయ్, బీవైడీ వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశాయి. రానున్న కాలంలో మరిన్ని మోడళ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది వినియోగదారులు ఈవీలను కొనుగోలు…