President Droupadi Murmu Gets Emotional As She Visits Her School In Odisha: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి తను చదువుకున్న పాఠశాల, హాస్టల్ ని శుక్రవారం సందర్శించారు. ఈ క్రమంలో తన చిన్ననాటి గుర్తులను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఒడిశా పర్యటనలో రెండో రోజు రాజధాని భువనేశ్వర్ లోని యూనిట్-2 ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. 1970వ దశకంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పాఠశాలలోని విద్యను అభ్యసించారు. కుంటాల కుమారి సబత్ ఆదివాసీ హాస్టల్ ని సందర్శించారు. ఈ క్రమంలో తాను పడుకున్న మంచం మీద కూర్చోని భావోద్వేగానికి గురయ్యారు. ప్రెసిడెంట్ ముర్ము 8వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ఈ పాఠశాలలోనే చదువుకున్నారు.
Read Also: PM Narendra Modi: భారతదేశాన్ని స్టార్టప్ హబ్‌గా మార్చడంలో బెంగళూర్ కీలకం
13 మంది సహవిద్యార్థులను కలుసుకున్నారు రాష్ట్రపతి. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉన్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. భువనేశ్వర్ లో ఖండగిరిలోని తపబానా హైస్కూల్ ను సందర్శించి దాన్ని ప్రారంభించారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. నేను నా పాఠశాల విద్యను మా ఊపర్బెడ గ్రామంలో ప్రారంభించానని.. పాఠశాలకు భవనం లేదని..గడ్డి ఇల్లులోనే చదువుకున్నామని రాష్ట్రపతి అన్నారు. నేటి పిల్లలు చాలా అదృష్టవంతులని.. మేము మా కాలంలో తరగతి గదులను ఊడ్చేవాళ్లం, ఆవుపేడతో పాఠశాల ఆవరణ శుభ్రం చేసేవాళ్లం అని..కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు సూచించారు.
మా కాలంలో బయటి ప్రపంచాన్ని తెలుసుకునేందుకు ఇంటర్నెట్, టెలివిజన్, ఇతర సదుపాయాలు లేవని.. దీంతో నాకు బయట నుంచి రోల్ మోడల్స్ ఎవరూ లేరని.. మా అమ్మమ్మ నా రోల్ మోడల్ అని రాష్ట్రపతి అన్నారు. మా ప్రాంతంలో ప్రజలు ముఖ్యంగా మహిళలు మానసికంగా దృఢంగా ఉండేవారని.. మా అమ్మమ్మ నుంచి జీవితంలో చాలా నేర్చుకున్నానని విద్యార్థులతో అన్నారు.
It was a nostalgic moment today when I visited my alma mater Government Girls High School and Kuntalakumari Sabat Adivasi Girls Hostel in Bhubaneswar. The visit brought back many fond memories of my student life. pic.twitter.com/X3QnyHRWmH
— President of India (@rashtrapatibhvn) November 11, 2022