Sabarimala All Set To Receive Pilgrims As Season Begins On Thursday: దేశంలో అత్యంత ప్రసిద్ధ దేశాలయం శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. వార్షిక మండలం-మకరవిళక్కు పుణ్యకాలం నవంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. దీంతో రేపు గురువారం నుంచి శబరిమల ఆలయ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఆలయం గర్భగుడిని బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు(తంత్రి) కదరారు రాజీవరు సమక్షంలో మరో అర్చకులు ఎన్ పరమేశ్వరన్ నంబూత్రి తెరవనున్నారు. దర్శనాల కోసం భక్తులు ఆన్లైన్ సేవలు ఉపయోగించుకోవాలని…
Former US President Donald Trump announces his bid for the 2024 presidency post: ఉత్కంఠకు తెరదించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ బుధవరా కీకల ప్రకటన చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొననున్నట్లు 76 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రిపబ్లిక్, డెమొక్రాట్ పార్టీ నుంచి అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తొలి వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు.
Biden holds emergency roundtable meeting with world leaders: ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాల్లో యూఎస్ ప్రెసిడెంట్ జో జైడెన్ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయన ప్రపంచ నాయకులతో అత్యవసరంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. మంగళవారం రష్యాకు సంబంధించిన ఓ మిస్సైల్ ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ లో పడిందని ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే రష్యా మాత్రం దీన్ని ఖండిస్తోంది. పోలాండ్ లో మిస్సైల్ కూలిపోవడంతో ఇద్దరు…
Significant Decline In Sperm Counts Globally, Including India: షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణీయంగా పడపోతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. సంవత్సరాల తరబడి గణనీయంగా తగ్గదల కనిపించిందని అంతర్జాతీయ పరిశోధకులు బృందం గుర్తించింది. హ్యామన్ రిప్రొడక్షన్ అప్డేట్ జర్నల్లో మంగళవారం ఈ విషయాన్ని ప్రచురించింది. మొత్తం 53 దేశాల డేటాను విశ్లేషించి పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. 2011-2018 మధ్య ఏడు సంవత్సరాల్లో డేటాను సేకరించి వీర్యకణాల సంఖ్యపై అధ్యయనం చేశారు
Gurgaon Woman To Get 2 Lakh Compensation After Being Attacked By Dog: కుక్క దాడిలో గురైన మహిళకు ఉపశమనం లభించింది. ఆగస్టు నెలలో గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళపై పెంపుడు కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ కేసులో గాయాలపాలైన మహిళకు రూ. 2 లక్షల మధ్యంతర పరిహారాన్ని ఇవ్వాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ)ని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక మంగళవారం ఆదేశించింది. అయితే ఈ మొత్తాన్ని కుక్క యజమాని నుంచి కూడా రికవరీ చేయవచ్చని…
2 Killed As Russian Missile Lands In Poland, Near Ukraine Border: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పోలాండ్ దేశంలో రష్యా మిస్సైల్ పేలుడు సంభవించింద. తూర్పు పోలాండ్ లోని ప్రజెవోడో అనే గ్రామంలో జరిగిన మిస్సైల్ పేలుడులో ఇద్దరు మరణించినట్లు పోలాండ్ మిలిటరీ తెలిపింది. ఈ ఘటనపై నాటో మిత్రపక్షాలు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. అయితే ఈ దాడి గురించిన సమాచారాన్ని పెంటగాన్ నిర్ధారించలేదు.
Elon Musk Fires Over 4,000 Contractual Employees Without Notice: ట్విట్టర్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దశలవారీగా ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తోంది. తాజాగా ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఎలాంటి నోటీసులు లేకుండా 4000 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. ఎలాన్ మస్క్ నిర్ణయంపై జాబ్ కోల్పోయిన ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. దాదాపుగా 4,400 మంది కాంట్రాక్టు ఉద్యోగులు తమ అధికార మెయిల్, ఆన్లైన్ సేవల యాక్సెస్ కోల్పోయారు.
Congress Party Task Force Meeting on 2024 Elections: 2024 సార్వత్రిక ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ సార్వత్రిక ఎన్నికల కోసం వ్యూహాలను రెడీ చేసుకుంటోంది. అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి పలుమార్లు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా 2024 లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ‘‘టాస్క్ ఫోర్స్’’ సమావేశం కానుంది. ముఖ్యంగా 2024 సార్వత్రిక…
56% of Indian parents say junk food ads fuel kids’ craving: ప్రస్తుత జనరేషన్ లో పిల్లలు ఇంట్లో తయారు చేసి వంటకాలను తినడము దాదాపుగా తగ్గించారు. ఎంత సేపు బేకరీ ఐటమ్స్, ఫిజ్జా, న్యూడిల్స్ అంటూ జంక్ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కాగా పిల్లలు ఇంతగా జంక్ ఫుడ్ తినడానికి కారణం ఏంటనేది కనుక్కోవాలని ఓ సర్వే చేస్తే 56 శాతం మంది భారతీయ తల్లిదండ్రులు ఒకే సమాధానం చెప్పారు. పిల్లలను లక్ష్యంగా చేసుకుని ప్యాక్ చేసిన…
Shahid Afridi reacts on Akhtar and Shami tweet war: పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్, భారత పేసర్ మహ్మద్ షమీ మధ్య ట్వీట్ వార్ తీవ్రం అయింది. ఇరు దేశాల ఫ్యాన్స్ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి వ్యవహారంపై మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిది స్పందించారు. ఆదివారం మెల్బోర్న్ లో జరిగిన ఫైనల్స్ లో పాకిస్తాన్, ఇంగ్లాండ్ తో ఓడిపోవడంతో అక్తర్, షమీల మధ్య ట్వీట్ వార్ ఎక్కువైంది. వీరిద్దరి ట్వీట్స్…