Police Complaint: ఉత్కంఠ రేపుతున్న ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వరలక్ష్మి శరత్‌కుమార్, టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పోలీస్ కంప్లైంట్’. హారర్ థ్రిల్లర్ అంశాలకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్‌మెంట్ జోడించి దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ సినిమా తెలుగు, కన్నడ టీజర్ లాంచ్ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది.
సాధారణంగా వరలక్ష్మి శరత్‌కుమార్ అంటే పవర్‌ఫుల్ విలనీ లేదా గంభీరమైన పాత్రలు గుర్తుకు వస్తాయి. కానీ ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రంలో ఆమె తొలిసారిగా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రేమ, పగ, మంచి-చెడుల మధ్య జరిగే ఒక ఆసక్తికరమైన పోరాటమే ఈ సినిమా. కేవలం హారర్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ప్రతి నిమిషం థ్రిల్ చేసే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించారు. హీరో నవీన్ చంద్ర ఇందులో ఒక బలమైన పాత్రలో నటించారు. ఆయన మార్క్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
Also Read
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ఒక కీలకమైన పాత్రలో నటించి థ్రిల్ పంచబోతున్నారు. ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది. ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు ఇందులో నటిస్తున్నారు. ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ అందించిన ఫైట్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర యూనిట్ తెలిపింది. దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ చిత్రాన్ని ఒకే భాషకు పరిమితం చేయకుండా తెలుగు, తమిళం, మలయాళం, మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. కథలో ఉన్న సార్వజనీనత ప్రతి భాషా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్ముతున్నారు.
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!