Man killed his girlfriend.. Body Chopped Into 35 Pieces: అత్యంత పాశవికంగా గర్ల్ ఫ్రెండ్‌ని హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. తననే నమ్ముకుని వచ్చిన అమ్మాయిని కడతేర్చాడు. వివరాల్లోకి వెళితే అఫ్తాబ్ అమీన్ పూనావాలా, శ్రద్ధా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ముంబైలో ఉన్న సమయంలో వీరిద్దరు లవ్ లో పడ్డారు. అయితే వీరిద్దరి వివాహాన్ని అమ్మాయి తరుపు బంధువులు ఒప్పుకోలేదు. కుటుంబాలను ఎదురించి ఢిల్లీ మెహ్రౌలీకి వచ్చిన అఫ్తాబ్, శ్రద్ధాలు కలిసి ఉంటున్నారు.
Joe Biden's granddaughter Naomi to get married at White House: అమెరికా అధ్యక్షడు జో బిడెన్ మనవరాలు వివాహం చేసుకోనున్నారు. ఆయన మనవరాలు నోమి బిడెన్ వివాహం వైట్‌హౌస్‌లో శనివారం జరగనుంది. వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు 18 మంది వివాహాలు జరిగియి. ఎక్కువగా అధ్యక్షుల కుమార్తెల వివాహాలే జరిగాయి. ప్రస్తుతం జరగనున్న నోమి బిడెన్ వివాహం 19వది. తొలిసారిగా ఓ అధ్యక్షుడి మనవరాలి వివాహం వైట్‌హౌస్‌లో జరగనుంది. వైట్‌హౌస్‌లో మొత్తం 18 వివాహాలు జరిగితే ఇందులో తొమ్మిది ప్రెసిడెంట్ కూతుళ్లవే జరిగాయి.…
Varanasi court to deliver its verdict on plea seeking worship rights of 'Shivling' on Gyanvapi premises: జ్ఞానవాపి మసీదు కేసులో ఈ రోజు వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. హిందూ పక్షం మసీదులోని కొలనులో లభించిన ‘ శివలింగం ’ ఆకారాన్ని పూజించేందుకు అనుమతించాలని కోర్టును కోరింది. దీనిపై నేడు తీర్పును వెల్లడించనుంది. నవంబర్ 8న ఈ కేసు తీర్పును నవంబర్ 14కు వాయిదా వేసింది. హిందూ పక్షం శివలింగానికి పూజలతో పాటు, ముస్లింల…
UP College Student Dies After physical assault, Accused Says He Took Energy Pill: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కాలేజీ విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో యువతి మరణించింది. అయితే పోలీస్ విచారణలో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడు కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో రాజ్ గౌతమ్ అనే యువకుడు…
Shoaib Akhtar Reflies to Mohammad Shami "Karma" Tweet: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్, పాకిస్తాన్ పై ఘన విజయం సాధించి ఛాంపియన్స్ గా నిలిచింది. వరల్డ్ కప్ పై భారీ ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే ఈ పరాజయం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీమును, పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లను ఇండియన్ నెటిజెన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండియన్ వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ, అక్తర్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. పాకిస్తాన్…
Man who lived in Charles de Gaulle airport for 18 years dies there: గత 18 ఏళ్లగా ఫ్రాన్స్ పారిస్ లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయంలోనే నివసిస్తున్న వ్యక్తి మోహ్రాన్ కరీమీ నస్సేరీ చివరకు అక్కడే కన్నుమూశాడు. ఏ దేశానికి చెందిన వాడు కాకపోవడంతో గత 18 ఏళ్లుగా ఎయిర్ పోర్టునే ఇళ్లుగా, ప్రయాణికులనే బంధువులుగా భావిస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఎయిర్ పోర్టులోని ఓ మూలలో తన సామాన్లను పెట్టుకుని అక్కడే నివసిస్తూ ఉండేవాడు. ఈయన లైఫ్…
Saudi Crown Prince Mohammed Bin Salman defers Pakistan trip: పీకల్లోతు ఆర్థిక కష్టాలు, రాజకీయ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. అక్కడి ఆర్థిక పరిస్థితి మరో శ్రీలంకలా తయారైంది. ద్రవ్యల్భనం పెరిగింది. దీనికి తోడు ఇటీవల వచ్చిన వరదలు పాకిస్తాన్ ను మరింతగా నష్టపరిచాయి. భారీ స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లింది. దీంతో తమకు సాయం చేయాలని పాక్ ప్రపంచ దేశాలను కోరుతోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్…
Iran Issues 1st Death Sentence Linked To Anti-Hijab Riots: ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో అట్టుడుకుతోంది. 22 ఏళ్ల మహ్స అమిని అనే మహిళను హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ 16న ఆమె చనిపోయింది. దీంతో అక్కడి మహిళల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో మహిళలు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి…
PM Modi to embark for Bali today for G20 Summit: ఇండోనేషియా బాలిలో నేటి నుంచి 17వ జీ20 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రోజున బాలికి బయలుదేరనున్నారు. ఆహారం, ఇంధన భద్రత- ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి వాటిపై వర్కింగ్ సెషన్స్ జరగనున్నాయి. ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్…
4.1 Magnitude Earthquake Hits Punjab Days After Tremors In Delhi: వరసగా భూకంపాలు, భూప్రకంపనలు దేశవాసులను కలవరపెడుతున్నాయి. ఇటీవల రోజుల వ్యవధిలోనే ఢిల్లీతో పాటు పలు హిమాలయ రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి. నేపాల్ లో వస్తున్న భూకంపాలు ధాటికి ఢిల్లీ నగరం వణికిపోతోంది. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో భూకంప సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. తెల్లవారుజామున 3.42 గంటలకు 4.1 తీవ్రతతో పంజాబ్ రాష్ట్రంలో అమృత్ సర్ భూకంపం వచ్చింది.