Shahid Afridi reacts on Akhtar and Shami tweet war: పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్, భారత పేసర్ మహ్మద్ షమీ మధ్య ట్వీట్ వార్ తీవ్రం అయింది. ఇరు దేశాల ఫ్యాన్స్ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి వ్యవహారంపై మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిది స్పందించారు. ఆదివారం మెల్బోర్న్ లో జరిగిన ఫైనల్స్ లో పాకిస్తాన్, ఇంగ్లాండ్ తో ఓడిపోవడంతో అక్తర్, షమీల మధ్య ట్వీట్ వార్ ఎక్కువైంది. వీరిద్దరి ట్వీట్స్ వైరల్ అయ్యాయి.
పాకిస్తాన్ ఓటమి అనంతరం షోయబ్ అక్తర్.. తన హృదయం ముక్కలు అయినట్లు ఎమోజీని పోస్ట్ చేశాడు. దీనికి రిప్లై ఇస్తూ మహ్మద్ షమీ ‘‘ సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. దీనికి ప్రతిగా అక్తర్, ప్రముఖ ఇండియన్ కామెంటర్ హర్షా భోగ్లే ట్వీట్ తో షమీకి సమాధానం ఇచ్చాడు. అయితే దీనిపై షాహీద్ అఫ్రిది స్పందించాడు. మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ఇలాంటి కామెంట్స్ చేయడం మానుకోవాలని హితవు పలికారు.
Read Also: Buffalo Died: నాగేదె చనిపోవడానికి కారణం హెలికాప్టర్.. పోలీసులకు ఫిర్యాదు
మేము క్రికెటర్లు అంబాసిడర్‌ల వంటివాళ్లమని.. రెండు దేశాలు( భారత్, పాకిస్తాన్) మధ్య ఉన్న చీలికను అంతం చేయడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలని.. ప్రజల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. మనమే ఇలా చేస్తే, అక్షరాస్యత లేని మూర్ఖుల నుంచి మనం ఏం ఆశించగలమని ప్రశ్నించారు. ఇరు దేశాలు సంబంధాలను ఏర్పరుచుకోవాలి. క్రికెట్ ఇందుకు సహకరిస్తుందని అఫ్రిది అన్నారు. భారత్ తో ఆడాలని అనుకుంటున్నామని.. పాకిస్తాన్ లో భారత టీమును చూడాలని అనుకుంటున్నానని అఫ్రిది సామా టీవీలో చర్చలో పాల్గొంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రిటైర్డ్ ప్లేయర్లు, ప్రస్తుతం జట్టుకు ఆడుతున్న క్రికెటర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని.. మీరు అలాంటి వాటికి దూరంగా ఉండాలని షమీకి సూచించాడు. ఆదివారం జరిగిన సెమీస్ లో ఇంగ్లాండ్, పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రెండోసారి టీ20 వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది.