అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్రసీమకు ధ్రువతార, ఆయన స్థాపించిన విద్యాసంస్థలు ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాయి. తాజాగా, తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ‘కింగ్’ నాగార్జున అక్కినేని చేసిన ప్రకటన విద్యా లోకంలో ఒక గొప్ప సంచలనంగా మారింది. కృష్ణా జిల్లా గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద ఏర్పడిన ఏఎన్ఆర్ కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవాల్లో నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Also Read :Saif Ali Khan : షారుఖ్-సల్మాన్ బాటలో నడవాలనుకోవడం లేదు.. సైఫ్ షాకింగ్ డిసిషన్
తన తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మల జ్ఞాపకార్థం భారీ విరాళాన్ని నాగార్జున ప్రకటించారు. ఇది కేవలం ఆయన ఒక్కరి నిర్ణయం మాత్రమే కాదని, తన సోదరుడు వెంకట్, సోదరి సుశీల, మొత్తం అక్కినేని కుటుంబ సభ్యులందరి సమిష్టి నిర్ణయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాగార్జున మాట్లాడుతూ “సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ సంస్థ అభివృద్ధి కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ఆయన వారసత్వాన్ని కొనసాగించడం, ఈ విద్యాసంస్థను నమ్ముకున్న విద్యార్థులకు అండగా నిలబడటం మా బాధ్యతగా భావిస్తున్నాం.” అన్నారు.
Also Read :Sonu Sood: 500 మంది మహిళలకు..అండగా నిలిచిన సోనూసూద్
ఈ 2 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ నిధిని కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో అర్హులైన విద్యార్థులకు అందేలా చూస్తామని నాగార్జున స్పష్టం చేశారు. ఈ నిధిని సరైన పద్ధతిలో, పారదర్శకంగా అమలు చేయడానికి కళాశాల యాజమాన్యంతో అక్కినేని కుటుంబం నేరుగా పని చేస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన, చదువులో రాణించే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లు ఒక గొప్ప ప్రోత్సాహకంగా మారుతాయి. నాగార్జున ఈ ప్రకటన చేయగానే సభా ప్రాంగణం అంతా విద్యార్థుల చప్పట్లు, ఈలలతో మారుమోగిపోయింది. వెండితెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా నాగార్జున ‘కింగ్’ అనిపించుకున్నారని అక్కడి వారు ప్రశంసించారు.