Union minister's remarks on live-in relationship sparks row: ఢిల్లీలో 27 ఏళ్ల యువతి శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా చంపేశాడు. శరీరాన్ని 35 ముక్కలుగా చేసి, 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరేశారు. శ్రద్ధా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరు నెలల తర్వాత ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది.…
India's first privately developed rocket Vikram-S set for launch today: భారతదేశ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగానికి సిద్ధం అయింది. భారత అంతరిక్ష చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. శుక్రవారం రోజు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి రాకెట్ విక్రమ్-ఎస్ ని ప్రయోగించనున్నారు. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ గా విక్రమ్-ఎస్ గుర్తింపు పొందింది. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయి పేరుతో రాకెట్ కు విక్రమ్-ఎస్ గా నామకరణం చేశారు. శుక్రవారం 11.30 గంటలకు…
21 Dead, Including 9 Children In Gaza Home Fire: పాలస్తీనా గాజా నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరానికి ఉత్తరంగా ఉన్న ఓ ఇంట్లో నిల్వ ఉంచిన ఇంధనం కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలతో సహా మొత్తం 21 మంది మరణించారు. పాలస్తీనాను నియంత్రించే హమాస్ ఇస్లామిస్టులు, స్థానిక అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పేశాయి. 21 మంది మరణించినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు.
Domestic LPG cylinders to come with QR codes soon: ఎల్పీజీ సిలిండర్లు త్వరలో క్యూఆర్ లతో వస్తాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం తెలిపారు. ఈ కోడ్ ఆధారంగా సిలిండర్లను ట్రాకింగ్, ట్రేసింగ్ సులభం అవుతుందని ఆయన అన్నారు. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా రెగ్యులేట్ చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ విధానం సహకరిస్తుందని వెల్లడించారు. సిలిండర్ల నిర్వహణ కూడా బాగుంటుందని ఆయన అన్నారు.
Koo Set For US Launch, Aims To Take On Elon Musk's Twitter: ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్ల డీల్ తో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్ టేకోవర్ తర్వాత నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు కంపెనీలో 50 శాతం ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే అని స్పషం చేశారు.
Aaftab Poonawala's water bill shows how he kept the murder hidden: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యంత క్రూరంగా తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ అనే 27 ఏళ్ల యువతిని అఫ్తాబ్ పూనావాలా చంపేశాడు. శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఓ ఫ్రిజ్ లో దాచి పెట్టాడు. 18 రోజుల పాటు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఢిల్లీ చుట్టుపక్కట ప్రాంతాల్లో పారేశాడు. ఈ కేసు దేశంలో సంచలనంగా మారింది.…
Dog dies a hero after saving owner from poisonous snake in UP’s Jhansi: కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన యజమాని కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అవుతుంది. యజమానులకు ఏమైనా జరిగితే తట్టుకోలేదు. సరిగ్గా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. తన యజమాని ప్రాణాలను కాపాడేందుకు తాను ప్రాణ త్యాగం చేసింది. మరణించి హీరోగా నిలిచింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని ప్రతాప్ పుర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. విషపూరితమైన పాము నుంచి యజమానిని…
National Highways Authority asks Mysuru civic body to demolish dome-shaped bus stand: కర్ణాటక మైసూరు నగరంలో ఉన్న మసీదు డోమ్ ఆకారంలోని బస్టాప్ వివాదాస్పదం అయింది. కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మైసూరు-ఊటీ రోడ్‌లోని మసీదు లాంటి బస్టాండ్‌ను బుల్డోజర్ చేస్తానని హెచ్చరించారు. ఈ హెచ్చరికల తర్వాత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) వివాదాస్పద బస్టాప్ ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ బస్టాప్ మైసూరు-ఊటీ రోడ్డులో ఉంది. బస్టాప్ ను కూల్చివేయాలని మైసూర్ సిటీ…
Elon Musk's Email To Twitter Staff Asks Them To Answer a Single Question: ట్విట్టర్ ఉద్యోగులకు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు కొత్త బాస్ ఎలాన్ మస్క్. కంపెనీలో కొనసాగుతానని హమీ ఇవ్వడంతో పాటు టైంతో పని లేకుండా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో సొంతం చేసుకున్నారు. వచ్చీ రావడంతోనే సీఈఓ పరాగ్ అగర్వాల్, పాలసీ చీఫ్ విజయగద్దెలతో పాటు మరికొంత మంది కీలక ఉద్యోగాలను తొలగించారు.…
Shraddha Walkar case- delhi incident: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది శ్రద్ధావాకర్ హత్య కేసు. సహజీవనంలో ఉన్న ఆమెను అతని లవర్ అత్యంత కిరాతకంగా చంపేశాడు. మృతదేహాన్ని 35 భాగాలు చేసి ఓ ఫ్రిడ్జ్ లో దాచి 18 రోజుల పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పారేశాడు. ఆరు నెలల తర్వాత శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు అఫ్తాబ్ పూనావాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.