Amazon Begins Mass Layoffs: టెక్ దిగ్గజాలు వరసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, నెట్ ఫ్లిక్స్, మెటా వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగింపును ప్రారంభించాయి. తాజాగా అమెజాన్ కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు యూఎస్ మీడియా నివేదికలు బుధవారం వెల్లడించాయి. చాలా సమీక్షల తర్వాత మేము ఇకపై కొందరి అవసరం ఉండదని హార్డ్‌వేర్ చీఫ్ డేవ్ లింప్ బుధవారం ఉద్యోగులకు ఇచ్చిన మెమోలోమ పేర్కొన్నారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను కోల్పోతామని మాకు తెలుసు కాబట్టి ఈ వార్త తెలపడం బాధగా…
5 Killed, 10 Injured In Shooting At Protesters In Busy Iran Market: హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో అట్టుడుకున్న ఇరాన్ లో కాల్పులు జరిగాయి. ఇరాన్ లోని నైరుతి ఖుజేస్తాన్ ప్రావిన్సులో నిరసనకారులు, భద్రతాబలగాలపైకి ఉగ్రదాడులు జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం ఐదుగురు మరణించినట్లు అక్కడి మీడియా బుధవారం వెల్లడించింది. రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించడంతో పాటు 10 గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఒక మహిళ మరియు…
Physical assault on minor girl in Tamil nadu: తమిళనాడులో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు ఐదుగురు దుర్మార్గులు. సామూహిక లైంగికదాడికి పాల్పడటంతో పాటు బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికకు నరకం చూపించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చిలో జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడేలా చేసింది ఆమెకు బంధువే. బంధువుతో పాటు మరో నలుగురు వ్యక్తులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Qualcomm Snapdragon 8 Gen 2 SoC officially unveiled: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 2 ఎస్ఓసీ చిప్ సెట్ ను అధికారంగా ఆవిష్కరించారు. బుధవారం జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ 2022లో తన కొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌ను ఆవిష్కరించింది. అంతకుముందు ఉన్న Gen 1+ SoC తర్వాత ఈ కొత్త చిప్ సెట్ వస్తోది. ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది Gen 1 చిప్ సెట్ తో పోలిస్తే…
earthquake Hits Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో భారీ భూకంపం వచ్చినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. రిక్టర్ స్కేల్ పై 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇండోనేషియా సుమత్రా ద్వీపానికి నైరుతి దిక్కులో బుధవారం 6 తీవ్రతతో భూకంపం వచ్చిందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం కేంద్రం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.
Parents must keep track of their daughters, Kiran Bedi on Shraddha's murder: పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యపై స్పందించారు. అమ్మాయిలు తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినా సరే.. వారు తమ కూతుళ్లపై నిఘా ఉంచాలని అన్నారు. ఈ కేసులో తల్లిదండ్రులు తమ కూతురు గురించి ఆలస్యంగా ఆరా తీశారని అన్నారు. శ్రద్ధా తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అన్నారు. ఈ ఘటనకు ఇరుగుపొరుగు వారు, ఆమె నివసించి ఫ్లాట్ యజమాని…
WhatsApp India Head, Meta India Public Policy Director Quit: ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా భారీగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. మెటాలో పనిచేస్తున్న 13 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో 11,000 ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ద్రవ్యోల్భనం, ఆదాయం తగ్గడం, ఆర్థిక మాంద్యం భయాలతో మెటా భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోంది.
President Biden's 'Salute' To PM Modi At G20: ఇండోనేషియా బాలిలో జీ-20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్, ఇతర అధినేతలు మడ అడవులను సందర్శించి మొక్కలు నాటారు. బాలిలోని తమన్ హుటాన్ రాయ మడ అడవులను దేశాధినేతలు సందర్శించారు.
Shraddha Walker case: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే 27 ఏళ్ల అమ్మాయిని అఫ్తాబ్ దారుణంగా హత్య చేశాడు. అత్యంత క్రూరంగా గొంతుకోసి శరీరాన్ని 35 భాగాలు చేసి 18 రోజుల పాటు ఢిల్లీ పరిసరల ప్రాంతాల్లో శరీర భాగాలను పారేశాడు. ఆరు నెలల క్రితం హత్య జరిగినా.. ఈ కేసు సోమవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఢిల్లీ పోలీసులు నిందితులు అఫ్తాబ్ ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Shraddha Walkar Case-Body parts human, blood traces found in flat: ఢిల్లీలో 27 ఏళ్ల శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యంత కిరాతకంగా శరీరాన్ని 35 భాగాలు చేసి, 18 రోజుల పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పడేశాడు నిందితుడు అఫ్తాబ్ పునావాలా. ఈ హత్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్యంత క్రూరంగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న ప్రియురాలిని చంపాడు అఫ్తాబ్. తాజాగా ఈ కేసులో పోలీసులు సాక్ష్యాలు వెతికే పనిలో ఉన్నారు.…