56% of Indian parents say junk food ads fuel kids’ craving: ప్రస్తుత జనరేషన్ లో పిల్లలు ఇంట్లో తయారు చేసి వంటకాలను తినడము దాదాపుగా తగ్గించారు. ఎంత సేపు బేకరీ ఐటమ్స్, ఫిజ్జా, న్యూడిల్స్ అంటూ జంక్ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కాగా పిల్లలు ఇంతగా జంక్ ఫుడ్ తినడానికి కారణం ఏంటనేది కనుక్కోవాలని ఓ సర్వే చేస్తే 56 శాతం మంది భారతీయ తల్లిదండ్రులు ఒకే సమాధానం చెప్పారు. పిల్లలను లక్ష్యంగా చేసుకుని ప్యాక్ చేసిన ఆహారపదార్థాల ప్రకటనలు వారిని జంక్ ఫుడ్ వైపు ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సర్వేని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన లోకల్ సర్కిల్స్ చేపట్టింది. దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్న రోజే ఈ సర్వే వచ్చింది.
Read Also: Shahid Afridi: అక్తర్, షమీ వ్యవహారంపై స్పందించిన షాహీద్ అఫ్రిది.. ద్వేషాన్ని పెంచొద్దని హితవు
92 మంది పిల్లల తల్లిదండ్రులు ప్యాక్ చేసిన ఆహారపదార్థాల ప్రకటనలను నిషేధించే విధంగా ప్రభుత్వ నిబంధనలు తేవాలని కోరకుంటున్నారు. సర్వేలో భాగంగా ఫ్యాక్ చేసి ఆహార ప్రకటనలను చూడకపోతే మీ పిల్లలు వాటిని కోరే అవకాశం ఉంటుందా..? అని ప్రశ్నించగా.. 56 శాతం మంది తల్లిదండ్రులు ఖచ్చితంగా కోరరని సమాధానం ఇవ్వగా.. 12 శాతం మంది తమ పిల్లలు వాటినే కోరుతారని .. 18 శాతం మంది కోరుకునే అవకాశం ఉండకపోవచ్చని అని వెల్లడించారు. కొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు తమ ప్రకటనల ద్వారా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను లక్ష్యంగా చేసుకోకుండా ఒక విధానాన్ని అనుసరించడం ప్రారంభించాయి.
ఇదిలా ఉంటే పిల్లలను టార్గెట్ చేస్తూ ఫ్యాక్డ్ ఫుడ్ ప్రకటనలను ప్రభుత్వం అడ్డుకునేలా నిబంధనలు రూపొందించాలా..? అని ప్రశ్నించగా.. 81 మంది తప్పకుండా రూపొందించాలని, 11 శాతం మంది 12 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లల కోసం తప్పకుండా నిబంధలు తీసుకురావాలని.. కేవలం 4 శాతం మంది మాత్రమే అవసరం లేదని తెలిపారు. మొత్తంగా 92 శాతం మంది ప్రభుత్వ నిబంధనలు తీసుకురావాలని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.