Twitter: ఎలాంటి నోటీస్ లేకుండా.. ఒకేసారి 4 వేల మంది ఉద్యోగుల తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk Fires Over 4,000 Contractual Employees Without Notice: ట్విట్టర్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దశలవారీగా ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తోంది. తాజాగా ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఎలాంటి నోటీసులు లేకుండా 4000 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. ఎలాన్ మస్క్ నిర్ణయంపై జాబ్ కోల్పోయిన ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. దాదాపుగా 4,400 మంది కాంట్రాక్టు ఉద్యోగులు తమ అధికార మెయిల్, ఆన్‌లైన్ సేవల యాక్సెస్ కోల్పోయారు.
Read Also: Krishna Health Updates Live: సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై డాక్టర్ల కీలక ప్రెస్ మీట్
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
మొత్తం ట్విట్టర్ లో 5,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే వారిలో 4400 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. ఈ తొలగింపులు కంటెంట్ నియంత్రణ, సైట్ ను అప్‌డేట్, రన్నింగ్ లో ఉంచే కీలక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ లో 50 శాతం ఉద్యోగులను అంటే దాదాపుగా 3700 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఎలాన్ మస్క్. భారతదేశంలో 90 శాతం మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ నిర్ణయం తీసుకున్న వారానికి తాజాగా 4వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు.
44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు ఎలాన్ మస్క్. వచ్చీ రావడంతోనే సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ తో పాటు పాలసీ చీఫ్ విజయ గద్దెలతో పాటు మరికొంత మంది ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు ట్విట్టర్ బోర్డును రద్దు చేసి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. వెరిఫైడ్ ఖాతాలకు నెలకు 8 డాలర్లు (భారత్ లో రూ. 719) వసూలు చేస్తామని అధికారికంగా ఎలాన్ మస్క్ ధృవీకరించారు. దీంతో పాటు రానున్న కాలంలో మరిన్ని పెయిడ్ సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!