2 Killed As Russian Missile Lands In Poland, Near Ukraine Border: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పోలాండ్ దేశంలో రష్యా మిస్సైల్ పేలుడు సంభవించింద. తూర్పు పోలాండ్ లోని ప్రజెవోడో అనే గ్రామంలో జరిగిన మిస్సైల్ పేలుడులో ఇద్దరు మరణించినట్లు పోలాండ్ మిలిటరీ తెలిపింది. ఈ ఘటనపై నాటో మిత్రపక్షాలు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. అయితే ఈ దాడి గురించిన సమాచారాన్ని పెంటగాన్ నిర్ధారించలేదు.
అయితే పోలాండ్ భూభాగంలో రష్యా మిస్సైల్ తాకినట్లు వస్తున్న వార్తలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ చర్యలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడమే అని అభివర్ణించింది. ఈ దాడి తరువాత జాతీయ భద్రత, రక్షణ వ్యవహారాల కమిటీతో పోలాండ్ ప్రధాని మాటెస్జ్ మొరావికీ సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే లాట్వీయా ఢిప్యూటి పీఎం ఆర్టిస్ పాబ్రిక్స్ రష్యాపై తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యా ఉక్రెయిన్ పౌరులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా పోలాండ్ లోని నాటో భూభాగంపై క్షిపణులు ప్రయోగించిందని ఆరోపించారు.
Read Also: Syamala Devi: ప్రాణస్నేహితులు.. కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోయారు.. కన్నీటిపర్యంతమైన కృష్ణంరాజు భార్య
నార్వే, లిథువేనియా, ఎస్టోనియా దేశాలు నాటో సభ్యదేశాలు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇది తీవ్రమైన సంఘటనగా నార్వే విదేశాంగ మంత్రి అన్నికెన్ హ్యట్ ఫెల్డ్ అన్నారు. నాటోని ప్రతీ భూభాగం రక్షించబడాలని లిథువేనియా అధ్యక్షడు గిటానాస్ నౌసెడా కోరారు. మిత్రదేశాలతో చర్చించి ఎలా స్పందించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఎస్టోనియన్ విదేశాంగ శాఖ మంత్రి ఉర్మాస్ రీన్సాలు అన్నారు.
రష్యా మంగళవారం ఉక్రెయిన్ పై భారీగా క్షిపణులతో విరుచుకుపడింది. రాజధాని కీవ్ తో పాటు తూర్పు ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ క్రమంలోనే పోలాండ్ భూభాగంపై క్షిపణి కూలవచ్చని తెలుస్తోంది. ఉక్రెయిన్ మరో నగరం ఎల్వీవ్ పోలాండ్ సరిహద్దుకు సమీపంలోనే ఉంది. దీనిపై దాడి చేస్తున్న సమయంలోనే మిస్సైల్ మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై నాటో సభ్యదేశాలు ఎలాంటి చర్య తీసుకుంటాయో చూడాలి.