Former US President Donald Trump announces his bid for the 2024 presidency post: ఉత్కంఠకు తెరదించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కీలక ప్రకటన చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొననున్నట్లు 76 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రిపబ్లిక్, డెమొక్రాట్ పార్టీ నుంచి అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తొలి వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు.
అమెరికా పునరాగమనం ఇప్పుడే ప్రారంభం అయిందని తన మద్దతుదారులతో డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. నేను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. అమెరికాను మళ్లీ గొప్పగా మరియు అద్భుతంగా మార్చడానికి, నేను ఈ రాత్రి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నానని రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Read Also: Joe Biden: ప్రపంచ నాయకులతో జో బైడెన్ అత్యవసర సమావేశం.. కారణం ఇదే..
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాట్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోయారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇప్పటికీ అమెరికాలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. గత వారం ఆయన మాట్లాడుతూ..తన అధ్యక్ష అభ్యర్థిత్వంపై త్వరలోనే ప్రకటన చేస్తానని చెప్పారు. తాజాగా ఆయన బుధవారం తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటిగా మారతుందని ఆశిస్తున్నానని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో పేర్కొన్నారు.
ఇటీవల అమెరికా వ్యాప్తంగా జో బైడెన్ ప్రజాధరణ తగ్గుతున్నట్లు సర్వేల్లో వెల్లడవుతోంది. ఆర్థిక సంక్షోెభం, ద్రవ్యోల్భనం, రష్యా-ఉక్రెయిన్ పరిణామాలను సమర్థవంతంగా ఎదర్కోవడం లేదనే అభిప్రాయం అమెరికన్లలో ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ తాను 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.