Taliban ban Afghan women from gyms, public baths: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై నిషేధం ఎక్కువైంది. మహిళలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. బయటకు వెళ్లాలన్నా మగతోడు కావాల్సిందే. ఇక మహిళ హక్కులనే మాటకు అక్కడ స్థానమే లేదు. ప్రజా ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేసిన మహిళలు ప్రస్తుతం ఉద్యోగాలను కోల్పోయారు. గతేడాది ఆగస్టులో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు అక్కడ మహిళపై తీవ్రమైన ఆంక్షలను విధిస్తున్నారు. మహిళలు విద్యకు దూరం…
Police officer, 4 others arrested over alleged molestation in Kochi: కేరళలో సంచలనం సృష్టించి సామూహిక అత్యాచార ఘటనలో పోలీస్ అధికారితో సహా నలుగురిని కేరళ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కొచ్చిలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేపూర్(కోజికోడ్) కోస్టల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పిఆర్ సునుతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీస్ అధికారితో పాటు నలుగురు కూడా తనపై అత్యాచారం చేసినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Blast At Busy Street In Turkey's Istanbul: టర్కీ వాణిజ్య నగరం ఇస్తాంబుల్ లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. బిజీగా ఉంగే ఓ స్ట్రీట్ లో శక్తివంతమైన పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇస్తిక్లాల్ స్ట్రీట్ లో జరిగిన ఈ పేలుడులో నలుగురు మరణించారు. 38 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడుకు సంబంధించి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు, 38 మంది గయపడినట్లు ఇస్లాంబుల్ గవర్నర్ అలీ యెర్లికాయ ట్విట్టర్ లో తెలిపారు.
"Its Called Karma" Mohammed Shami's Response To Shoaib Akhtar's Tweet: టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 19 ఓవర్లలోనే ఛేదించింది. బెన్ స్టోక్స్ అద్భుత హాఫ్ సెంచరీతో పాటు సామ్ కర్రన్ సూపర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ మరోసారి టీ20 ఛాంపియన్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ టీమ్, క్రికెటర్లు, మాజీ క్రికెటర్లపై తెగ ట్రోలింగ్…
T20 WC Final, Memes on Pak fan: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. మరోసారి టీ20 ఛాంపియన్ గా నిలిచింది. అయితే క్రికెట్ ను అమితంగా ఇష్టపడే పాకిస్తాన్ అభిమానులు మాత్రం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ జట్టు అద్భుతం సృష్టిస్తుందని అనుకున్న ఆ దేశ అభిమానులకు నిరాశే ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కు ఇంగ్లాండ్ బౌలర్లు కళ్లెం వేశారు. 8 వికెట్ల నష్టానికి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది.…
Explosion On Train Track: రాజస్థాన్ రైల్వే ట్రాకుపై పేలుడు సంభవించింది. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అసర్వా-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లడానికి గంటల ముందు, ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే దీంట్లో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయపూర్‌లోని జావర్ మైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెవ్డా కి నాల్ సమీపంలోని ఓధా వంతెనపై ట్రాక్‌లను దెబ్బతీయడానికి మైనింగ్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
Man Tricks Daughter To Write Suicide Note, Then Kills Her: కంటిక రెప్పటా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురిని మోసం చేసి హత్య చేశాడు. తన బంధువులను ఇరికించేందుకు కూతురి మరణాన్ని వాడుకోవాలని చూశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే 40 ఏళ్ల వ్యక్తి తన 16 ఏళ్ల కూతురు చేత సూసైడ్ నోట్ రాయించి, ఆత్మహత్య చేసుకునేలా నాటకం ఆడాలని సూచించాడు. అయితే తండ్రి మాటలను నమ్మిన ఆ బాలిక తండ్రి చెప్పినట్టే…
Ukrainians celebrate Russia’s retreat from Kherson: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చేతులెత్తేస్తోంది. గతంలో స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వదిలిపెట్టి వెనక్కి వెళ్తున్నాయి. గతంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనుదిగిరిగాయి. దీంతో ఉక్రెయిన్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. నెల క్రితం రష్యా ఉక్రెయిన్ లోని ఖేర్సన్, లూహన్స్క్, డోనెట్స్క్, జపొరిజ్జియా ప్రాంతాలను తనలో విలీనం చేసుకుంది.…
T20 World Cup Final 2022: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా ఇంగ్లాండ్ నిలిచింది. రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. సునాయాసమైన 138 పరుగుల టార్గెట్ ను ఆడుతూపాడుతూ అందుకుంది. 19 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 138 పరుగులును ఛేదించింది. ప్రపంచకప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కు నిరాశే ఎదురైంది. బెన్ స్టోక్స్ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగడంతో మరో ఓవర్ ఉండగానే ఇంగ్లాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల…
Rajiv Gandhi assassination case: సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు తమిళనాడు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు మరో ఐదుగురు వెల్లూరు, మధురై జైళ్ల నుంచి విడుదల అయ్యారు. ఆదివారం నిందితుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు తనకు సహాయపడిన వారందరికి థాంక్స్ చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో ప్రియాంకా గాంధీ వాద్రా కలిసిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు.