74th Republic Day celebrations in Delhi: 74వ గణతంత్ర వేడుకలు దేశం సిద్ధం అయింది. దేశ రాజధాని ఢిల్లీ రిపబ్లిక్ డే ఉత్సవాలకు మస్తాబు అయింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రిపబ్లిక్ డే వేడులకు జరగనున్నాయి. ఈ వేడుకలకు అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్వా అల్ సిసి హాజరవ్వనున్నారు. రిపబ్లిక్ డే పెరేడ్ వీక్షించేందుకు టికెట్లు ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంచిన ప్రభుత్వం. సీటింగ్ సామర్థ్యాన్ని 1.2 లక్షల నుంచి 45 వేలకు తగ్గించారు
Donald Trump To Be Allowed Back On Facebook, Instagram After 2-Year Ban: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తిరిగి అనుమతించనున్నారు. యూఎస్ కాపిటల్ పై 2021లో జరిగిన దాడి తర్వాత ట్రంప్ పై నిషేధం విధించాయి. రెండేళ్ల తర్వాత ఆయన అకౌంట్లను పునరుద్దరించనున్నట్లు సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం మెటా మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లేగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే దీనిపై ట్రంప్ కానీ, అతని…
Republic Day: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు మోహరించాయి. రిపబ్లిక్ డే పెరేడ్ ను దాదాపుగా 65,000 మంది వీక్షిస్తారని ఢిల్లీ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రధాన సర్కిళ్లలో స్నిఫర్ డాగ్ లు, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. వీరికి విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు…
Helicopter carrying Sri Sri Ravi Shankar makes emergency landing: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, యోగా గురు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కు ప్రమాదం తప్పింది. అతను ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దట్టమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ ప్రయాణానికి ఇబ్బంది కావడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. తమిళానాడు ఈరోజు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Ants Can Detect Scent Of Cancer In Urine: చీమలకు క్యాన్సర్ ను గుర్తించగలవని కొత్త అధ్యయనంలో తేలింది. చీమలు మూత్రం వాసన చూడటం ద్వారా క్యాన్సర్ ని గుర్తించగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. చీమలకు ముక్కులు లేకపోయిన వాటి ముందు భాగంలో ఉంటే యాంటేన్నా వంటి నిర్మాణాలపై గ్రాహాకాలు ఉంటాయి. ఇవి వాసనను గుర్తించగలవు. ముఖ్యంగా క్యాన్సర్ ఉన్న కణితులు అస్థిరమైన కర్బన సమ్మేళనాలని పిలువబడే రసాయనాలను విడుదల చేస్తాయి. ఇమ మన చమట, మూత్రంలో కనిపిస్తాయి. అయితే…
Pakistan hit by petrol shortage: ఆర్థికంగా దివాళా అంచున ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ ను వరసగా సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటే ఆ దేశం అప్పుల కోసం అరబ్ దేశాలతో పాటు ఐఎంఎఫ్ ను సంప్రదిస్తోంది. విదేశీమారక నిల్వలు లేక ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోలేని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే నిన్నటి వరకు పాకిస్తాన్ ను విద్యుత్ సంక్షోభం కలవరపెడితే.. తాజాగా పెట్రోల్ సంక్షోభం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ లోని పలు ప్రావిన్సులను పెట్రోల్ కొరత వేధిస్తోంది. పలుచోట్ల పెట్రోల్…
SCO Summit: ఈ ఏడాది షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. భారత్ లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోను భారత్ సమావేశాలకు రావాల్సిందిగా ఆహ్మానించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంతో ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ ద్వారా ఆహ్వానాలు వెళ్లాయి. ఎస్సీఓ విదేశాంగ మంత్రులు, ఆయా దేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశం మే మొదటి వారంలో గోవా వేదికగా జరగనుంది. దీని కోసం బిలావల్ భుట్టోతో పాటు…
Lakhimpur Kheri Case: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించి, రాజకీయ దుమారానికి కారణం అయిన లఖీంపూర్ ఖేరీ రైతుల హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు 8 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తన బెయిల్‌ను తిరస్కరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఆశిష్ మిశ్రా సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేరం రుజువైతే తప్పా నిందితుడిని నిరవధికంగా జైలులో ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Pathan Movie Row: ‘‘ ఫిల్మ్ చలేగా హాల్ జలేగా(సినిమాను ప్రదర్మిస్తే, సినిమా హాల్ తగలబడుతుంది)’’ అంటూ హిందూ సంఘాలు ఆందోళనకు పాల్పడ్డారు. బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ లో పఠాన్ సినిమానున ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద హల్చల్ చేశారు. విడుదలకు ముందే పఠాన్ సినిమా పలు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగల్ పూర్ లోని దీప్ ప్రభ థియేటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం సినిమా హాల్ వెలుపల పఠాన్ సినిమా పోస్టర్లను చింపి తగలబెట్టారు. భజరంగ్…
Lucknow building collapse: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో భవనం కుప్పకూలిన ఘటనలో సమాజ్ వాదీ ఎమ్మెల్యే షాహీద్ మంజూర్ కొడుకును పోలీసులు నిన్న అర్థరాత్రి మీరట్ లో అదుపులోకి తీసుకున్నారు. లక్నోలని హజ్రత్ గంజ్ వజీర్ హసన్ రోడ్ లోని అలయా అపార్ట్మెంట్ భవనం కుప్పకూలింది. ఈ భవనం ఎస్పీ ఎమ్మెల్యే కొడుకు నవాజీష్, అతని మేనల్లుడికి చెందినది. సుమారు 12 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ అపార్ట్మెంట్ లో మొత్తం 12 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఖాళీగా ఉన్నాయి.…