Donald Trump: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ.. నిషేధం ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump To Be Allowed Back On Facebook, Instagram After 2-Year Ban: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తిరిగి అనుమతించనున్నారు. యూఎస్ కాపిటల్ పై 2021లో జరిగిన దాడి తర్వాత ట్రంప్ పై నిషేధం విధించాయి. రెండేళ్ల తర్వాత ఆయన అకౌంట్లను పునరుద్దరించనున్నట్లు సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం మెటా మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లేగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే దీనిపై ట్రంప్ కానీ, అతని మద్దతుదారులు కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ట్రంప్ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ కు మళ్లీ వస్తారా..? లేదా..? అనేది ప్రస్తుతానికి తెలియదు.
Read Also: Republic Day: ఢిల్లీలో హై అలర్ట్.. 6 వేల మందితో భద్రతా ఏర్పాట్లు..
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
2021 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి అనంతరం ఆయన మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో బైడెన్ ఎన్నికల గెలుపు ధృవీకరణను ఆపేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ట్విట్టర్ తో సహా ఫేస్ బుక్, ఇన్ స్టాలు బ్యాన్ విధించాయి. దీని తర్వాత ట్రంప్ సొంతగా ‘ట్రూత్ సోషల్’ పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ని ప్రారంభించారు. 88 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్న అతని ట్విట్టర్ ఖాతా కూడా గతంలో బ్యాన్ చేయబడింది. ఇటీవల ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ట్రంప్ రీ ఎంట్రీపై పోల్ నిర్వహించారు. మెజారిటీ యూజర్లు ట్రంప్ రీఎంట్రీకి ఓటు వేయడంతో ట్విట్టర్ లో కూడా అతని ఖాతాను పునరుద్దరించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!