Helicopter carrying Sri Sri Ravi Shankar makes emergency landing: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, యోగా గురు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కు ప్రమాదం తప్పింది. అతను ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దట్టమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ ప్రయాణానికి ఇబ్బంది కావడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. తమిళానాడు ఈరోజు జిల్లాలో ఈ ఘటన జరిగింది. రవిశంకర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బెంగళూర్ నుంచి తమిళనాడులోని తిరువూర్ వైపు వెళ్తోంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Read Also: Road Accident: అమెరికాలో రోడ్డుప్రమాదం.. కర్నూలు జిల్లా యువతి మృతి
ఈ సమయంలో సత్యమంగళం అడవుల్లోకి ప్రవేశించిన సమయంలో దట్టమైన పొగమంచు ఉండటంతో విజిబిలిటీ తగ్గింది. దీంతో పైలెట్లు ఈరోడ్ జిల్లాలోని ఉకినియం ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. వాతావరణం మెరుగుపడిన 40 నిమిషాల తర్వాత మళ్లీ హెలికాప్టర్ టేక్ఆఫ్ అయింది. తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీశ్రీ రవిశంకర్ వెళ్తున్నారు. ప్రతికూల వాతావరణం హెలికాప్టర్లకు ప్రతిబంధకంగా మారుతుంది. గతంలో దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ ప్రతీకూల వాతావరణంలో హెలికాప్టర్ క్రాష్ వల్లే మరణించారు.
Tamil Nadu | A helicopter carrying Art of Living's Sri Sri Ravi Shankar and four others made an emergency landing due to bad weather at Sathyamangalam in Erode today morning. All passengers safe. The helicopter took off after 50 minutes once the weather cleared. pic.twitter.com/KiQJ30irUn
— ANI (@ANI) January 25, 2023
A Chopper carrying #SriSriRaviShankar made an emergency landing in #Erode , #TamilNadu at 10.30 am due to inclement weather conditions.All the passengers and crew members are safe.Later Chopper took off at 11.10 am. @SriSri pic.twitter.com/4NBK0q3uNQ
— Yasir Mushtaq (@path2shah) January 25, 2023