Telangana Cabinet Meeting: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ నెల 5న ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బడ్జెట్ పై చర్చించి, కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో భారీ బడ్జెట్ తో రాబోతోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాదాపుగా 3లక్షల కోట్ల రూపాయలతో…
US Layoffs: ఆర్థిక మాంద్యం భయాలు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వరసగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ట్విట్టర్ ఇలా తమ ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించేశాయి. ఆయా కంపెనీలతో దశాబ్ధాల కాలం అనుబంధం ఉన్న ఉద్యోగులను కూడా తొలగించాయి. అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఊడాయి.
Uniform Civil Code: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలియజేసింది. యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి సిఫారసులు చేయాలని ప్రభుత్వం 21వ లా కమిషన్ ను కోరిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Maharashtra: మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, డిఫ్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సొంత ఇలాకాలో బీజేపీ ఓడిపోయింది. బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి చేతిలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో నాగ్పూర్ స్థానం నుంచి ఎంవీఏ బలపరిచిన అభ్యర్థి సుధాకర్ అద్బలే విజయం సాధించారు. బీజేపీ మద్దతు ఉన్న నాగో గనార్ ఓడిపోయారు.
Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పై రోజుకో పిడుగు పడుతోంది. ఇప్పటికే అక్కడ గోధుమ సంక్షోభం నెలకొంది. ప్రజలకు నిత్యాసరం అయిన పిండి అందుబాటులో లేదు. తాజాగా మరో సంక్షోభం కూడా రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు అక్కడి వ్యాపారులు. రానున్న రోజుల్లో దేశంలో నెయ్యి, వంటనూనెల కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. బ్యాంకులు నిత్యావసరాల దిగుమతి కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ)లను విడుదల చేయకపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుందని అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
MP govt renames Bhopal's Islam Nagar village as Jagdishpur: ఇటీవల కాలంలో పలు ప్రాంతాల పేర్లను మార్చి కొత్త పేర్లను పెట్టడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు పట్టణాల పేర్లను మార్చివేడయం చూశాం. యోగీ సర్కార్ ఉత్తర ప్రదేశ్ లో కొలువుదీరిన తర్వాత అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, ముస్తాఫాబాద్ ను రాంపూర్ గా, ఫిరోజాబాద్ ను చంద్రానగర్ గా, మొగల్ సరాయ్ ను పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్…
Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయ మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితం అయిందని అన్నారు. ఈ నెల 6 నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలోొ హాత్ సే హాత్ జోడో ప్రారంభం అవుతుందని అన్నారు.
Freedom App: రైతులు, చిన్న వ్యాపారులు తమ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు, ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి దోహదపడుతున్న ఫ్రీడమ్ యాప్ కోటి డౌన్లోడ్లను దాటింది. ప్రారంభించిన 33 నెలల వ్యవధిలోనే ప్రజాధరణ పొందింది. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మళయాళం వంటి స్థానిక భాషల్లో కూడా కంటెంటు రూపొందించడంతో ప్రజలకు చేరువైంది. ప్రస్తుతం వ్యవసాయం, వ్యాపారం రంగాల్లో 960 కోర్సులను కలిగి ఉంది.
TSPSC Group 4 Exam on 1st June: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ). యువత ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్ 4 పరీక్షా తేదీని గురువారం ప్రకటించింది. జూలై 1న తెలంగాణ వ్యాప్తంగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని నోటిఫికేషన్ లో…
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో ఈడీ చార్జీషీట్ లో కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది.