74th Republic Day celebrations in Delhi: 74వ గణతంత్ర వేడుకలు దేశం సిద్ధం అయింది. దేశ రాజధాని ఢిల్లీ రిపబ్లిక్ డే ఉత్సవాలకు మస్తాబు అయింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రిపబ్లిక్ డే వేడులకు జరగనున్నాయి. ఈ వేడుకలకు అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్వా అల్ సిసి హాజరవ్వనున్నారు. రిపబ్లిక్ డే పెరేడ్ వీక్షించేందుకు టికెట్లు ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంచిన ప్రభుత్వం. సీటింగ్ సామర్థ్యాన్ని 1.2 లక్షల నుంచి 45 వేలకు తగ్గించారు.
Read Also: Donald Trump: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ.. నిషేధం ఎత్తివేత
రిపబ్లిక్ డే పెరేడ్ లో భాగంగా మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేసి ఆయుధాలను ఆర్మీ ప్రదర్శించనుంది. ఉదయం 10.30 గంటలకు విజయ్ చౌక్ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు పరేడ్ సాగనుంది. గణతంత్ర వేడుకల్లో ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఒక్కో బృందం కవాతు నిర్వహించనుంది. జాతీయగీతం ఆలాపన సందర్భంగా 21 గన్ సెల్యూట్స్ కోసం సాంప్రదాయంగా ఉపయోగించే పురాత బ్రిటీస్ పౌండర్ గన్స్ కు బదులుగా 105ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ ను ఉపయోగించనున్నారు. ఈజిప్టు నుంచి వచ్చిన 120 మంది సైనికులతో కూడిన పటాలం కవాతు నిర్వహించనుంది. కొత్తగా ఆర్మీలో చేరిన అగ్నివీర్ లతో కూడిన పటాలం కవాతు చేయనుంది. ఆర్మీ సిగ్నల్ కోర్, ఎయిర్ డిఫెన్స్ , ఆర్మీ డేర్ డెవిల్స్ విభాగాల నుండి మహిళా అధికారుల మార్చ్ చేయనున్నారు.
ఆకాష్ క్షిపణుల విభాగానికి లెఫ్టినెంట్ చేతన్ శర్మ నేతృత్వ వహించనున్నారు. బీఎస్ఎఫ్ కేమెట్ కంటింజెంట్ లోని మహిళల టీమ్ పెరెడ్ లో భాగం కానుంది. నారీశక్తి ప్రదర్శనలో భాగంగా నేవీలోని 144 సెయిలర్ విభాగానికి మహిళా అధికారిణులు నేతృత్వం వహిస్తారు. రిపబ్లిక్ డే ఫ్లై ఫాస్ట్ లో మొత్తం 44 త్రివిధ దళాల విమానాల విన్యాసాలు, 9 రఫేల్ యుద్ధ విమానాలతో పాటు , దేశీయంగా తయారయిన తేలికపాటి అటాక్ హెలీకాప్టర్లలతో విన్యాసాలు నిర్వహిస్తారు. ఈ గణతంత్ర వేడుకల్లో జనభాగదారి(ప్రజల భాగస్వామ్యం) స్ఫూర్తితో జరుగుతాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ విన్యాసాలు, వారి కుటుంబ సభ్యులు, కర్తవ్య మార్గంలోని నిర్వహణ కార్మికులు, కూరగాయాల విక్రేతలు, కిరాణా దుకాణదారులు, రిక్షా పుల్లర్స్ పాల్గొనడం విశేషం.