Pathan Movie Row: ‘‘ ఫిల్మ్ చలేగా హాల్ జలేగా(సినిమాను ప్రదర్మిస్తే, సినిమా హాల్ తగలబడుతుంది)’’ అంటూ హిందూ సంఘాలు ఆందోళనకు పాల్పడ్డారు. బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ లో పఠాన్ సినిమానున ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద హల్చల్ చేశారు. విడుదలకు ముందే పఠాన్ సినిమా పలు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగల్ పూర్ లోని దీప్ ప్రభ థియేటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం సినిమా హాల్ వెలుపల పఠాన్ సినిమా పోస్టర్లను చింపి తగలబెట్టారు. భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
Read Also: Pataan Leaks: సల్మాన్ ఖాన్ వీడియో లీక్… ఒకే ఫ్రేమ్ లో సల్మాన్-షారుఖ్
సినిమాను ప్రదర్శించేందుకు మేము అనుమతించమని.. సినిమాను ప్రదర్మిస్తే, సినిమా హాల్ తగలబడుతుందని వార్నింగ్ ఇచ్చారు. భాగల్ పూర్ లోని ఏదైనా సినిమా థియేటర్ లో పఠాన్ సినిమాను ప్రదర్శిస్తే, భాగల్పూర్ ప్రజలు సహించరని హిందూ గ్రూప్ నాయకులు హెచ్చరించారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా బహిష్కరిస్తామని అన్నారు. కాషాయ రంగును, సనాతన ధర్మాన్ని అవమానించే సినిమా ప్రదర్శన జరగనివ్వమని అన్నారు. హిందుత్వ విషయంలో రాజీ పడలేమని.. సనాతన సంస్కృతిని వ్యతిరేకించే దేన్నైనా భారత దేశం, భాగల్పూర్ సహించదని అన్నారు. ఇదిలా ఉంటే థియేటర్ యాజమాన్యం స్థానిక పోలీసులు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. థియేటర్ కు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పఠాన్ సినిమాలో ‘బేషరమ్ రంగ్’ పాట వివాదాస్పదం అయింది. ఈ పాటలో దీపికా పదుకొణే కాషాయ రంగు బికినీ ధరించడంతో హిందూ సంస్థలు, కొంతమంది బీజేపీ నాయకులు ఈ సినిమాను వ్యతిరేకించారు. ఈ పాటలో అభ్యంతర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేశారు. పఠాన్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందంటూ హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బాలీవుడ్ సినిమాపై కామెంట్స్ చేయవద్దని పార్టీ నేతలకు, ఇతరులకు సూచించారు. అంతకుముందు అస్సాంలోని గౌహతి, గుజరాత్ అహ్మదాబాద్ లో కూడా కొన్ని థియేటర్ల వద్ద సినిమాను ప్రదర్శించవద్దని పలువురు ఆందోళన నిర్వహించారు.
#WATCH | Bihar: A poster of the film 'Pathaan' was torn and burnt outside a cinema hall in Bhagalpur (24.01) pic.twitter.com/aIgUdxOl6a
— ANI (@ANI) January 24, 2023